36.2 C
Hyderabad
April 16, 2024 22: 33 PM
Slider జాతీయం

న్యాయమూర్తుల్ని దూషించిన మాజీ జస్టిస్ పై కేసు

#CSKarnan

సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై దారుణమైన ఆరోపణలు చేసిన మద్రాసు హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్​ సీఎస్​ కర్ణన్​పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.

మహిళలను అగౌరపరిచే విధంగా జస్టిస్​ కర్ణన్​ ఆరోపణలు చేశారని, ఆయనపై చర్యలు చేపట్టాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డేకు మద్రాసు హైకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు లేఖ రాశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలా మంది మహిళలను లైంగికంగా వేధించారనేది ఆయన ఆరోపణ. న్యాయమూర్తుల ప్రవర్తనపై ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇటీవలే ఆయన ఒక వీడియోను కూడా విడదల చేశారు.

దీనిపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. ఇప్పుడు ఫిర్యాదు రావడంతో ఆయనపై చెన్నై సైబర్ సెల్ పోలీసులు సెక్షన్ 153, 509 కింద కేసులు నమోదు చేశారు.

జస్టిస్​ కర్ణన్​ గతంలోనూ వివాదాల్లో చిక్కుకున్నారు. కోర్టు ధిక్కరణ, న్యాయప్రక్రియపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 2017లో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు​. ఆయనను పదవి నుంచి తప్పించారు.

తాను దళితుడిని అయినందునే తనపై కఠిన చర్యలు తీసుకున్నారని అప్పటిలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు.

Related posts

యోగా డే సందర్భంగా విజయనగరం లో 5 k రన్…!

Satyam NEWS

తొలకరి బంధం

Satyam NEWS

అంగన్ వాడి ద్వారా గర్భిణీలకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ…

Satyam NEWS

Leave a Comment