39.2 C
Hyderabad
April 25, 2024 15: 46 PM
Slider కృష్ణ

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతపై విచారణలో ఉన్న కేసుల ఉపసంహరణ

#samineniudayabhanu

తెలుగుదేశం నాయకులపై కేసులు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తమ నేతలపై ఉన్న కేసులను మాత్రం ఎత్తివేస్తున్నది.

ప్రభుత్వ చీఫ్ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై వివిధ దశల్లో విచారణలో ఉన్న పది కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది.

కేసులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ప్రత్యేక కోర్టులో ఉదయభాను కేసులు విచారణలో ఉన్నాయి.

డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

కేసుల ఎత్తివేతకు వీలుగా ఆయా కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది.

ఉదయభానుపై జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లలో వివిధ అభియోగాలతో పలు కేసులు నమోదయ్యాయి.

Related posts

దర్శకేంద్రుడి ప్రశంసలు దండిగా పొందిన కాస్ట్యూమ్ డిజైనర్

Satyam NEWS

దేశంలోనే తొలి “సైకోమెట్రిక్ విద్య” రాష్ట్రంగా తెలంగాణ

Satyam NEWS

ఆస్తులు కాపాడలంటూ మున్సిపల్ కమీషనర్ కు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్లు

Satyam NEWS

Leave a Comment