కులం కులం కులం… కులంతోనే తెలుగుదేశం వాళ్లు బతుకుతున్నట్లు కనిపిస్తున్నది. వినాయక విగ్రహం వద్ద కొబ్బరికాయ కొడుతుండగా తాడికొండ వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు టిడిపి కార్యకర్తలు. ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నది. ఈ కేసుకు సంబంధించి A1.కొమ్మినేని శివయ్య, A2.కొమ్మినేని సాయి, A3.కొమ్మినేని రామకృష్ణ, A4.కొమ్మినేని బుజ్జి అనే నలుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.వారిపై సెక్షన్స్ 509 294 r/w 34 ipc, sec 3(1), R, 3(1)(S ) SC, ST (POA) అట్రాసిటీ యాక్ట్ ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ వారిని అరెస్టు చేయలేదు. అనంతవరం గ్రామంలోని వినాయక విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టటానికి ఎంఎల్ఏను వైసిపి కార్యకర్తలు ఆహ్వానించారు. శ్రీదేవి కొబ్బరికాయ కొడితే వినాయకుడు మైలపడతాడంటూ కులం పిచ్చితో ఉన్నఈ టిడిపి కార్యకర్తలు వ్యాఖ్యానించారు. దాంతో అవమానంతో కళ్లనీళ్లు పెట్టుకుని ఆమె వెనుదిరిగివెళ్లిపోయారు. రాజధానిలో వైస్సార్సీపీ గెలవడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని అందుకే తనను కులం పేరుతో దూషిస్తున్నారని ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. కులగజ్జితో సమాజాన్ని చెడగొడుతున్న వారిని చంద్రబాబునాయుడు పెంచిపోషిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కుల రాజకీయాలు చేస్తూ దళిత కులాలను దారుణంగా వ్యాఖ్యానిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆమె అన్నారు. గత ఐదేళ్లలో దారుణంగా ప్రవర్తించిన తెలుగుదేశం కులపిచ్చి నేతలు ఇంకా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
previous post