30.7 C
Hyderabad
April 24, 2024 02: 23 AM
Slider నల్గొండ

BJP,TRS ఢిల్లీ లో దోస్తీ,ఢిల్లీ లో కుస్తీ చందంగా ఉంది

#CongressParty

బిజేపి, టీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగులకు ఆశలు  కల్పించి మోసం చేశాయని TPCC రాష్ట్ర జాయింట్ సెక్రటరీ MD అజీజ్ పాషా అన్నారు. కోటీ ఉద్యోగాలు కల్పిస్తామని BJP చెప్పి 7 సంవత్సరాలు గడిచింది కానీ అమలు జరగలేదని అన్నారు.

టిఆర్ఎస్ పార్టీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, నేటి వరకు నిరుద్యోగ భృతి కల్పించలేదని అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో ఆదివారంఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు నిరాశతో ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు.

అందుకే నిరుద్యోగ యువత నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జానారెడ్డి ని గెలిపించాలని కోరారు. సునీల్ నాయక్ చనిపోవడం చాలా బాధాకరమని, మనస్సు  చేయించిందని,కాంగ్రెస్ పార్టీ సునీల్ నాయక్ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటుందని అన్నారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ రావు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్   సాముల శివారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో దోస్తి, గల్లీలో కుస్తీ అన్న విధంగా BJP,TRS రెండు పార్టీలు ఒక్కటేనని,

రైతులకు సంబంధించిన రైతు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను పునః సమీక్షించుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు.రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయ్యాల్సిన బాద్యత ప్రభుత్వానిదని,తక్కువ తూకం వేసి మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మూత పడిన పాఠశాలలను వెంటనే తెరవాలని,విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి వారికి మంచి విద్యాబోధన అందించాలని కోరారు.

పక్క రాష్ట్రంలో విద్యార్థులు బోర్డ్ పరీక్షల్లో ముందంజలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారని,మన రాష్ట్రంలో కూడా అలాగే చేయాలని అన్నారు.వైన్స్, సినిమా థియేటర్లు తెరిచి ఉంటాయి, వాటికి ఎలాంటి నిబంధనలు ఉండవా? అని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ముందు విద్య సంస్థలు ప్రారంభించి ఎన్నికలయ్యాక బంద్ చేయటంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు.ప్రైవేటు టీచర్లు ఉపాధి కోల్పోతున్నారని, వారి పరిస్థితి గందరగోళంగా ఉందని,వారి భవిష్యత్ ను ఆలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముశం సత్యనారాయణ, సమ్మెట సుబ్బరాజు,వల్లపుదాసు కృష్ణ,దొంతగాని జగన్,రేపాకుల కోటయ్య, జానయ్య,దనమూర్తి,కె.రాము,శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో బోనాల ఉత్సవాలు

Bhavani

ఎఫ్‌.3 : పూజా హెగ్డే పార్టీ సాంగ్ షూటింగ్ ప్రారంభం

Satyam NEWS

చంద్రయాన్ 3 రాకెట్ స్పేర్ పార్ట్స్ హైదరాబాద్ లో తయారీ

Bhavani

Leave a Comment