35.2 C
Hyderabad
April 24, 2024 11: 47 AM
Slider గుంటూరు

కులాల వారీగా బీసీ జనాభా లెక్కించాలి.

బీసీల జనాభా కులాల వారీగా లెక్కించడంతో పాటు బీసీలకు ప్రతి జిల్లాలో మూడు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు బీసీ రమణ పేర్కొన్నారు. మంగళగిరి లోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ… రానున్న 2024 ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలపై ప్రేమను చూపిస్తోన్నాయని, గత ఏడు దశాబ్థాలుగా బీసీ జాతి హక్కుల కోసం పోరాడుతున్నా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల జనాభా కులాల వారీగా లెక్కించాలనేది బీసీ వర్గాల చిరకాల కోరిక అని, ఇప్పటికైనా ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలన్నారు.

బీసీ విద్యార్థులకు, మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయే గానీ వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదన్నారు. ఈ నేపధ్యంలో బీసీ డిమాండ్ల సాధన కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలను నియమిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి అసోసియేట్ అధ్యక్షులు గా తెనాలికి చెందిన కావేటి వేణుగోపాలరావు ను నియమిస్తూ నియామకపు ఉత్తర్వులను అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల గట్ల వాసు మాట్లాడుతూ… కొన్ని బీసీ సంఘాలు జనాభా ఎక్కువగా ఉన్న కులాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని, బీసీల్లో ఉన్న దిగువ స్థాయి కులాలైన కృష్ణ బలిజ, పూసల, దాసరి, మేదర, జంగమ, ఉప్పర , కుమ్మరి, రజక కులాలకు కూడా ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి అట్టడుగు బీసీ కులాలకు సైతం తగిన ప్రాముఖ్యతను కల్పించడం రుగుతుందన్నారు. సామాజిక న్యాయం , రాజ్యాధికారం అందరికీ అందించటమే ధ్యేయంగా బీసీ చైతన్య సమితి పని చేస్తోందన్నారు. వచ్చేనెలలో విజయవాడలో జరిగే ప్లీనరీ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఏపీ బీసీ చైతన్య సమితి అసోసియేట్ అధ్యక్షులు కావేటి వేణుగోపాలరావు మాట్లాడుతూ… బీసీల

సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఏపీబీసీ చైతన్య సమితి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా నియమించిన వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ బీసీ చైతన్య సమితి యువజన అధికార ప్రతినిధి మునగాల సునీల్, గుంటూరు నగర మహిళా అధ్యక్షురాలు, మువ్వ బుజ్జమ్మ, కె.శ్రీరాములు, వై.వేణు, పి.రమణయ్య, ఎన్.సుబ్బారావు, ఎ.నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు అవ‌గాహ‌న‌

Sub Editor

రణం నా గుణం..

Satyam NEWS

థర్డ్ వేవ్ నేపథ్యంలో విజయనగరం పోలీసుల సన్నద్ధత

Satyam NEWS

Leave a Comment