ఎకరంన్నర స్థలం పోయే సరికి బుర్ర తిరిగి మోచేతిలోకి వచ్చేసింది. జగన్ జైలుకు వెళ్తాడని, ఏపిలో బిజెపి వాళ్లు వైసిపి ప్రభుత్వాన్ని పడగొడతారని, కేసీఆర్ జగన్ పోట్లాడుకుంటున్నారని కలలు వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకూ కమ్మ కులానికి తానే ప్రతినిధిని, ఈనాడు రామోజీ రావు స్థానంలో తానే రాజగురువును అవుతానని కన్న కలలు కల్లలయ్యాయో ఏమో కానీ ఇప్పుడు తన స్థలం కాపాడుకోవడానికి కమ్మ కులం అంతా తన వెంట నడవాలని లేకపోతే కమ్మ కులాన్ని జగన్ తొక్కేస్తాడని కమ్మ కులస్తులను పత్రికా పరంగా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టేశాడు.
స్థూలంగా ఇదీ ఈరోజు దీపావళి అని కూడా చూడకుండా మతాబులు, సోడియం పొటాషియం పొగలు చిమ్మినట్లు జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మేశాడు. పత్రికా ముఖంగా కులం గురించి మాట్లాడటానికి కొంచెం బెరుకుగానే ఉంటుంది. అయితే నిస్సిగ్గుగా కులం గురించి నేరుగా రాసేశాడు. పోలీసులలో కమ్మ కులం వారిని పక్కన పెట్టేశారని రాశాడు. కమ్మ కులాన్ని దెబ్బ తీస్తే తప్ప తెలుగుదేశం పార్టీ కనుమరుగు కాదని జగన్ భావిస్తున్నాడట.
అంటే తెలుగుదేశం కేవలం కమ్మవాళ్ల పార్టీనేనా? కమ్మవారిని బ్లాక్ మెయిల్ చేయడానికి తెలుగుదేశం పార్టీపై కూడా కమ్మ కులం ముద్రవేసేశాడు. ఈ వాదనతో సిబి నాయుడు ఏకీభవిస్తున్నారా? స్పష్టం చేయాలి. ఈ చెత్త పలుకుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేయకపోతే తెలుగుదేశం పార్టీ కమ్మ కులస్తులకు చెందిన వారి పార్టీయేనని వప్పుకున్నట్లుగా భావించాల్సి వస్తుంది. జగన్ కేసీఆర్ కలిసి ఒక ప్రముఖ న్యాయవాదిని పిలిచి అభిప్రాయం తీసుకున్నారట.
సిబిఐ పట్టుబడితే జగన్ కు బెయిల్ రద్దు కాకుండా అడ్డుకోవడం కష్టమని ఆయన చెప్పాడట. జగన్ సినిమా ఒక సంవత్సరంలో ముగిసిపోతుందట. సిబి నాయుడే నయం జగన్ కు మూడేళ్లు టైమ్ ఇచ్చాడు. మూడేళ్ల తర్వాత జమిలి ఎన్నికలు వస్తే జగన్ ప్రభుత్వం పోతుందని సిబినాయుడు చెప్పాడు. అయితే ఎకరంన్నర స్థలం పోయేసరికి కొత్త పలుకు కు దిమ్మతిరిగి జగన్ ప్రభుత్వానికి ఏడాదే టైమ్ పెట్టేశాడు. జగన్ ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత పెరిగినపుడు జగన్ కు బిజెపి ప్రభుత్వం బెయిల్ రద్దు చేయిస్తుందట. ఈ దేశంలో చట్టం లేదు.
ఈ ఒక్క వాక్యంతో దేశ న్యాయ వ్యవస్థను అవమానించాడు. బిజెపి ఎలా చెబితే అలా జడ్జిలు నడుచుకుంటారని చెప్పడం ద్వారా న్యాయవ్యవస్థ ను అవమానిస్తున్నాడు. జైలుకు వెళ్లేలోపు జగన్ పాపులారిటీ సంపాదించుకోవడం కోసం ప్రభుత్వం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడట. జగన్ పాపులర్ కాపోతే 151 సీట్లు ఎలా వస్తాయో? ఎకరంన్నర పోయే సరికి లాజిక్కులు కూడా పోయాయి. కాపు కులస్తుల్ని జగన్ దూరం చేసేసుకుంటున్నాడట. ఇది మరో కుట్రపూరిత కథనం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిబినాయుడు కోటి నాటకాలు ఆడినా కాపులు ఓటు వేయలేదు. ఇప్పుడు కాపుల్ని జగన్ కు దూరం చేస్తే తప్ప సిబినాయుడు, ఈ కొత్తపలుకు బతకలేరు.
అందుకే కాపుల్ని దూరం చేసేందుకు కలలు కంటున్నారు. కాపులు జగన్ తో ఉంటారా ఉండరా అనేది కాదు ఇక్కడ విషయం. సిబినాయుడు, కొత్త పలుకు కుట్ర గురించి చెప్పడమే ఉద్దేశ్యం. కమ్మ కులస్తులు వైసిపిలో చేరితే ద్వితీయ శ్రేణి పౌరులుగానే మిగిపోవాల్సి వస్తుందని కమ్మ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉదాహరణ చెబుతున్నాడు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నియోజక వర్గం నుంచి తన కుమారుడికి టిక్కెట్ కోసం జగన్ దగ్గరకు వెళ్లారు. కుమారుడు హితేష్ కు పౌరసత్వ సమస్యలు ఉండటంతో వేరే వారికి టిక్కెట్ ఇవ్వకుండా మీరే పోటీ చేయండి అని జగన్ ఆయనకు టిక్కెట్ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైసిపి నాయకులు చాలా మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు కానీ జగన్ మాత్రం అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.
దగ్గుబాటి తన మనుగడ కోసం పార్టీ మరుతుంటే అదేదో ఆయనకు జరిగిన అవమానం కింద రాస్తున్నాడు. రాసేవన్నీ అసత్యాలు కాబట్టే ఇంత కటువుగా చెప్పాల్సి వస్తున్నది. కమ్మ కులస్తుల గనులు క్వారీలూ రద్దు కేస్తారని కమ్మ కులస్తుల్లో భయం పుట్టేలా వార్తలు రాస్తున్నాడు. ఏ కులం వాడైనా అక్రమంగా గనులు, క్వారీలు తవ్వుతుంటే రద్దు చేయరా? సిబినాయుడు చేసినట్లు కులం చూసి వదిలేయాలా? ఉన్నత స్థాయిలో కూడా అవినీతి జరుగుతున్నదని ఒక ఉన్నతాధికారి చెప్పాడట.
ఆ ఉన్నతాధికారి ఎవరో చెప్పగలవా? ఎలా చెబుతావులే. అది కట్టుకథ కదా? ఏపిలో వ్యాపారం చేసుకోవాలంటే కప్పం కట్టాలట. అలా కట్టించుకున్న వారు ఆత్మహత్య చేసుకున్నా కొత్త పలుకు మాత్రం మారలేదు. కే టాక్స్ వసూలు చేసిన అనుభవంతో చెబుతున్నాడు పాపం. ఏటా వంద కోట్లు ఇవ్వాలని ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెడుతున్న ఒక నాయకుడు ఒక వ్యాపారవేత్తను ఆదేశించాడట.
వై ఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పనులు చేసి డబ్బులు తీసుకునేవాడని నేరుగా రాసేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 స్థానాలు ఇచ్చి ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఆ విషయం మరచిపోయి (మరచిపోవడానికి కనీసం ఏడాది కూడా పూర్తి కాలేదు… అంత తొందరెందుకో) ఇష్టాను సారం రాసేస్తున్నాడు కొత్తపలుకులో.
నంద్యాల ఉప ఎన్నికలో గెలిచిన తెలుగుదేశం ఓడిపోయినట్లే హుజూర్ నగర్ లో గెలిచిన టిఆర్ఎస్ కూడా కచ్చితంగా ఓడిపోతుందట. బివేర్ కేసీఆర్. ఈ కొత్త పలుకు గాడు శాపనార్ధాలు పెట్టేస్తున్నాడు. (సత్యం న్యూస్ వీక్షకులు ఎంతో సున్నిత మనస్కులు. కులం గురించి నేరుగా రాసే అలవాటు లేని నేను ఈ సారి కులం గురించి నేరుగా రాయాల్సి వచ్చింది. ఇది నాతప్పు కాదు. కులం పేరు నేరుగా రాసి జర్నలిజం స్థాయిని మరొక మెట్టు దించిన వారిది.)