34.2 C
Hyderabad
April 19, 2024 22: 25 PM
Slider రంగారెడ్డి

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో పేదరైతు రెండు ఎద్దులు బలి

#talakondapally

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్ అనే బిద రైతు కు సంబంధించిన రెండు ఎడ్లు విద్యుత్ తీగలు తెగి పడి చనిపోయినట్లు తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల్ వెంకటేష్ పేర్కొన్నారు.

ఈ బీద రైతు వ్యవసాయంపైనే ఆధారపడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నట్లు, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే అతను రోడ్డున పడ్డట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అతని కి నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నో చట్టసభల్లో మండల సభల్లో జనరల్ బాడీ లో భూమికి ఐదు అడుగుల ఎత్తున విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన  పట్టించుకోవడంలేదని ఆయన తెలిపారు. మనుషులతో పాటు గోర్లు ,పశువులు చనిపోతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల నోట్లో మట్టి కొట్టడమే నా  బంగారు తెలంగాణ అని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వానికి శుద్ధి ఉన్నట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే ప్రమాద కారకంగా ఉన్న విద్యుత్ తీగలను ఎత్తులో  అమర్చాలని ఆయన కోరారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్తంభానికి స్తంభానికి 50 ఫీట్ల దూరం ఉండాలి. కాగా నిబంధనలు తుంగలో తొక్కి అధికారులు మనుషులు పశువులు చచ్చిపోతున్నా మాకేంటి అని ధోరణి లో ప్రవర్తించడం విడ్డూరంగా ఉంది.

ప్రభుత్వ ఖజానా లో డబ్బులు లేవని సాకు చెబుతుంటారు. యూనిట్ రేట్లు పెంచుకుంటూ పోతారు. కానీ నిబంధనల ప్రకారం స్తంభాలకు కేబుల్ ఆపరేటర్లు, నెట్ సెంటర్ ల కలెక్షన్లు విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటున్న అందుకు నెలకు పది రూపాయల చొప్పున ఒక్కో స్తంభానికి చెల్లించాల్సి ఉంటుంది.

కాగా ఇటువంటి నిబంధనలను పాటిస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా నూతన స్తంభాలు వేయటానికి ఈ ఆదాయం తోడ్పడుతుందని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.

Related posts

ఆంధ్రాకు ద్రోహం చేసిన బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించండి

Satyam NEWS

కొల్లాపూర్ లో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

పంచెకట్టు తో ఆకట్టుకున్న నట సింహం

Satyam NEWS

Leave a Comment