అమరావతి బిల్లును అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ వారిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నది. అమరావతిలో ఎసైన్డ్ భూములు కొనుగోలు చేసినందుకు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ లపై సిబిసీఐడి కేసు నమోదు చేసింది. అదే విధంగా 796 తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్‌పై కూడా సిబిసీఐడి కేసులు నమోదు చేసింది.
తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ అయి ఉండి వీరంతా ఎకరం భూమి రూ.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు సిబిసీఐడి విచారణలో వెల్లడి అయింది. దాంతో వీరిపై కేసులు నమోదు చేశారు. వీరిపై విచారణ కోసం సిబిసీఐడి నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. 43 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్నారు. 188 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ తాడికొండలో 180 ఎకరాలు కొన్నారు.
238 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ తుళ్లూరులో 243 ఎకరాలు కొన్నారు. 148 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ మంగళగిరిలో 133 ఎకరాలు కొన్నారు. 49 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్నారు. ఇలా అమరావతి భూముల కొనుగోలుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం ట్రాన్సాక్షన్ విలువ రూ.300 కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.