36.2 C
Hyderabad
April 25, 2024 20: 37 PM
Slider జాతీయం

ముఖ్యమంత్రి అవినీతిపై సీబీఐ కేసు నమోదు

#UttarakhandCMnew

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ పై అవినీతి ఆరోపణల కేసు నమోదు అయింది. ఒక జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆరోపణలపై సీబీఐ కూలంకషంగా దర్యాప్తు చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం రాజకీయంగా పెను సంచలనం కలిగిస్తున్నది.

స్థానిక న్యూస్ ఛానెల్ అయిన సమాచార్ ప్లస్ విలేకరి ఉమేష్ శర్మ పరిశోధనాత్మక కథనంపై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది.

బిజెపి జార్ఖండ్ ఇన్ చార్జిగా ఉన్న రావత్ 2016లో గో సేవా ఆయోగ్ అనే సంస్థకు ఒక వ్యక్తిని నియమించేందుకు అతని నుంచి లంచం తీసుకున్నారని,

తన బంధువుల ఎకౌంట్ లోకి డబ్బులు బదిలీ చేయించుకున్నారని ఉమేష్ శర్మ తన కథనం లో పేర్కొన్నారు.

Related posts

ఎడ్వయిజ్: హోలీ పండుగలో చైనా కలర్స్ వాడవద్దు

Satyam NEWS

వాటర్ ప్లాంట్ యజమానులకు హెచ్చరిక.. అనుమతి లేకుంటే సీజ్

Satyam NEWS

సోమసుందర్ నగర్ పార్కు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కాలేరు

Bhavani

Leave a Comment