28.7 C
Hyderabad
April 24, 2024 06: 45 AM
Slider జాతీయం

చెక్ మేట్: జీవీకే గ్రూప్ పై సీబీఐ కేసు నమోదు

#GVK Industries

జీవీకే గ్రూప్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు అయింది. దీని ద్వారా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం మియాల్ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి రూ.310 కోట్లు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. కంపెనీ చైర్మన్ జి. వెంకట కృష్ణారెడ్డి, ఆయ‌న కుమారుడు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ జీవీ సంజ‌య్ రెడ్డిల‌పై కేసు న‌మోదు అయింది.

మొత్తం రూ.805 కోట్ల మేర‌ అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు న‌మోదు అయ్యాయి. ఈ మొత్తం వ్యవహారం 2012-2018 మధ్య కాలంలో జరిగింది. జీవీకేతో బాటు మరో 9 ప్రైవేటు కంపెనీలు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపై కూడా సీబీఐ కేసు నమోదు అయింది.

Related posts

మదినగూడ నారాయణ పాఠశాలలో ఘనంగా మ్యాథమాటిక్స్ డే..

Satyam NEWS

17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఫిరాయింపుకు సిద్ధం

Satyam NEWS

ఈ గొలుసుల దొంగకు ఒక ప్రత్యేకత ఉంది

Satyam NEWS

Leave a Comment