27.7 C
Hyderabad
April 26, 2024 03: 07 AM
Slider కడప

సీఎం జగన్ ఓఎస్డీ ని 6.30 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ

#CBI

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌ను కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో 6.30గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు.

అవినాష్‌ రెడ్డి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా గతంలో కృష్ణ మోహన్‌ రెడ్డితో పాటు నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణకు ఈరోజు వీరిద్దరూ హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎవరెవరు ఫోన్‌ చేశారు?

ఏం మాట్లాడారు? మీతోనే మాట్లాడారా .. ఇంకెవరికైనా ఫోన్‌ ఇచ్చారా? అనే అంశాలపై సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.

Related posts

“ఊర్వశి” దరి చేరిన “నిన్ను చేరి”

Satyam NEWS

లయన్స్ క్లబ్ ములుగు ఆధ్వర్యంలో విద్యార్థులకు టై బెల్ట్ బ్యాడ్జీలు పంపిణీ

Satyam NEWS

బ్రుటాలిటీ: పోలీసులు దారుణంగా వ్యవహరించారు

Satyam NEWS

Leave a Comment