27.7 C
Hyderabad
March 29, 2024 03: 05 AM
Slider రంగారెడ్డి

అంతర్జాతీయ అకడమిక్ ఎక్స్ఛేంజ్ కి సీబీఐటి ఒప్పందాలు

#cbit

చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు స్టేట్ ఎడ్యుకేషనల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ పెడగోజికల్ కాలేజ్ ఆఫ్ దుషాన్‌బే సిటీ, తజికిస్తాన్ మధ్య ఆవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మీద సి బి ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి, డైరెక్టర్ రబిసోడా నజీబుల్లో సంతకం చేశారు. అదేవిధం గా చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  –  ఎస్ఎమ్ఎస్ మరియు ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ టూరిజం అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆఫ్ తజికిస్తాన్ మధ్య ఆవగాహన ఒప్పందం జరిగింది.

ఈ ఒప్పందం మీద సి బి ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి,  ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ టూరిజం అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆఫ్ తజికిస్తాన్ డైరెక్టర్ ఆస్టోర్జోడా ఉబైదుల్లో సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రెండు కళాశాలలు  విద్య, నిర్వహణ సంబంధిత, శాస్త్రీయ పరిశోధన, వ్యవస్థాపక కార్యకలాపాల రంగంలో పరస్పర సహకారం కు ఒప్పుకున్నాయి. పాఠ్యాంశాలను అభివృద్ధి చేయటం లో, విలువ ఆధారిత ఉమ్మడి కార్యక్రమాలు, నిర్వహణ సంబంధిత, శాస్త్రీయ, పద్దతి పత్రాలు, పాఠ్యపుస్తకాలు, బోధనా పరికరాలు,  ప్రయోజనాల కోసం పరస్పర సహాయం చేసుకుంటాయి.

నిర్వహణ సంబంధిత రంగంలో సమాచార మార్పిడి, శాస్త్రీయ, సాంకేతిక పరిశోధన, హ్యాకథాన్లు, ఉమ్మడి నిర్వహణ సంబంధిత, శాస్త్రీయ కార్యక్రమాలు,  అలాగే అంతర్జాతీయ కన్సల్టెన్సీ, అంతర్జాతీయ ప్రాజెక్టులు, గ్రాంట్లు, కార్యక్రమాలు,  సెమినార్లు, వర్క్‌షాప్‌లు, రిఫ్రెషర్ ప్రోగ్రామ్‌లు, ఇండక్షన్ ప్రోగ్రామ్‌లు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, నిర్వహణ అభివృద్ధి కార్యక్రమాలు, సింపోజియంలు, ప్రదర్శనల విషయాల్లో పరస్పర సహాయం చేసుకుంటాయని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు.

అంతర్జాతీయ అకడమిక్ ఎక్స్ఛేంజ్  ప్రకారం రెండు సంస్థలు  శిక్షణ, అధునాతన శిక్షణ మరియు నిర్వహణ సంబంధిత, శాస్త్రీయ మరియు విద్యా కార్యకలాపాల మెరుగుదలలో పరస్పర సహాయం చేసుకుంటాయి అని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు.  డాక్టర్ టిఎస్ పూర్ణచంద్రిక  ఈ కార్యక్రమానికి సమన్వయకర్త గా వ్యవహరించారు.

తజీకిస్తాన్ ఇంజనీరింగ్ బోధనా కళాశాల అంతర్జాతీయ సంబంధాల అధికారి  గులోవా షాహ్లో మిరా మడోవావో,  అసోసియేట్ ప్రొఫెసర్, ఆర్థిక సిద్ధాంతం, వ్యవస్థాపక కార్యకలాపాల విభాగం అధిపతి ఐయూటిఈటి  సఫ్కేవ్ అడుమాజిద్ కరిమోయిచ్, డైరెక్టర్ – ఇంక్యూబేషన్ అండ్ ఇన్నోవేషన్ ప్రొఫెసర్ ఉమాకాంత చౌదరి,  డాక్టర్ థమన్ జీత్, డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్ , కేశవ బాలాజీ రావు, తులసి రామ్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

Related posts

అయ్యో పాపం: బందరు వీధుల్లో జోలెపట్టిన చంద్రబాబు

Satyam NEWS

కాప్రా మునిసిపాలిటీలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ

Satyam NEWS

కాలేజీకి వెళ్లిన ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

Satyam NEWS

Leave a Comment