ఏపి మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరూ నేడు వేరు వేరుగా క్రిష్టమస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని నిర్మలా కాన్వెంట్ సమీపంలోని సెంట్ పాల్ కాథలిక్ చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.
ఆయనతో బాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కేసినేని నాని, బోండం ఉమ, గద్దె రామ్మోహన్ రావు, దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరులు కూడా క్రిస్మస్ వేడుకల్లో పాలుపంచుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని హిందు కాలేజ్ కూడలి వద్ద నున్న సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిస్ చర్చ్ లో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన లో నారా లోకేష్ పాల్గొన్నాడు.
ఆయనతో బాటు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి, మద్దిరాల మ్యాని, నసీర్ అహ్మద్, మన్నవ సుబ్బారావు, డేగల ప్రభాకర్, అబ్బూరి మల్లి ముఖ్య నాయకులు ఈ సందర్భంగా హాజరయ్యారు.