28.7 C
Hyderabad
April 20, 2024 07: 22 AM
Slider ఖమ్మం

సురక్షితమైన సమాజం లక్ష్యంగా సిసి కెమెరాల ఏర్పాటు

#khammampolice

సురక్షితమైన సమాజమే లక్ష్యంగా నిఘా వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ అన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు.

శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఖమ్మం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిని సారించిందని, ఇందులో భాగంగా సీసీ కెమెరాలతో జిల్లాను నిఘా నీడల్లోకి తీసుకొచ్చి భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరిచే లక్ష్యంతో భవిష్యత్తులో 15 వేల కెమెరాలు ఏర్పాటు చేసేందుకు  అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.  ఖమ్మం నగరంలోనే 10 వేల కెమెరాలు పెట్టడంతో పాటు  జిల్లాలోని  అన్ని కెమెరాలను  కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నగరంలోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మొత్తం  జిల్లాలోనే  సేఫ్ అండ్ స్మార్ట్ జిల్లాగా రూపొందించాలని పోలీస్ శాఖ భావిస్తోందని తెలిపారు.

నేరం చేసే వాడికి శిక్ష పడాలని, నేరం చేయని వారికి అవి రక్షణగా ఉండాలనే ఉద్దేశంతో   టెక్నాలజీ పరమైన సంస్కరణలు తీసుకురావడం తద్వారా వాటి ఫలితాలు ప్రజలకు అందాలనే సంకల్పంతో పోలీస్ శాఖ దృష్టి సారించిందని తెలిపారు.

నేరస్థులు కూడా కొత్త తరహా  పద్ధతులను ఎంచుకుని నేరాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ప్రస్తుత తరుణంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. ఒక పక్క నేరాలను అదుపు చేయడం.. మరో పక్క  నేరాలు జరగకుండా అడ్డుకోవడంలో సీసీ కెమెరాలు తమ వంతు పాత్రను పోషిస్తూ.. సంచలనాత్మకమైన కేసుల్లో పోలీసులకు క్లూ ఇస్తున్నాయని అన్నారు.

నేర నియంత్రణ, మెరుగైన సమాజం కోసం గ్రామస్థాయి నుంచే చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోందని. ఇందులో భాగంగా ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్, నేనుసైతం కార్యక్రమాలలో   విస్తృతంగా ప్రచారం చేస్తూ.   ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా స్ధానికులను చైతన్య  పరుస్తునట్లు తెలిపారు.

24 గంటలు నిర్విరామంగా పనిచేసే ఒక సీసీ కెమెరా వందమంది కానిస్టేబుళ్లతో సమానం. మీ ప్రాంతాలలో అపరిచిత వ్యక్తుల కదలికలు, అసాంఘీక కార్యకాలపాలు, ఏ చిన్న నేర సంఘటన జరిగిన గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతోగానో సహకరిస్తాయని తెలిపారు. కార్యక్రమంలోఅడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్ పాల్గొన్నారు.

Related posts

దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: సుప్రీంకోర్టుకు నివేదిక

Satyam NEWS

టోల్ రోడ్ లీజ్ వల్ల రాష్ట్రానికి నష్టం

Bhavani

500 కోట్ల తో మెడికల్ కాలేజీ వర్చువల్ శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment