30.7 C
Hyderabad
April 23, 2024 23: 58 PM
Slider హైదరాబాద్

నేరరహిత సమాజంగా మార్చడానికి సీసీ కెమేరాలు దోహదం

#cc cams

కేసుల పురోగతితో పాటు నేరరహిత సమాజంగా మార్చడానికి సీసీ కెమేరాలు దోహదపడతాయని ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు.

రామంతాపూర్‌ రహదారిలోని కుతుబ్‌ షాయి మజీద్‌ లో మాజీ కార్పోరేటర్‌ గంధం జోత్న్సనాగేశ్వరరావు సొంత ఖర్చులతో  ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలను ఉప్పల్‌ సిఐ గోవిందరెడ్డి తో కలిసి ఎమ్మేల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడతూ యాక్సిడెంట్స్‌ , హత్యలు , అనుమానాస్పద కేసులలో సీసీ కెమేరాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. ఒక్క సిసి కెమేరా వందమంది పోలీసులతో సమానమని అన్నారు. మజీద్‌ కమిటి సభ్యులకు ఇచ్చిన హామీ మేరకు 16 చానల్‌ డీవీఆర్‌,  32 ఇంచెస్‌ మానిటర్‌, 8 సీసీ కెమేరాలను ఏర్పాటు చేయించామని మాజీ కార్పోరేటర్‌ గంధం జోత్న్స నాగేశ్వరరావు అన్నారు.

కార్యక్రమంలో మజీద్‌ కమిటీ సభ్యులు  ప్రెసిడెంట్‌ మహ్మద్‌ తోషిక్‌, సెక్రటరీ ఖాజామొయిద్దీన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ జహంగీర్‌, సర్వర్‌, షరీఫ్‌, యాజస్‌, సమీర్‌, ఫయాజ్‌, సాలార్‌ ఇక్బల్‌, తెరాస నాయకులు గంధం నాగేశ్వరరావు, మధుసూదన్‌రెడ్డి,  గరిక సుధాకర్‌, సాయి, చంబు, మనీష్‌, శ్రీను, నందు  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపి భవన్ లో ‘ఐ లవ్‌ అమరావతి’ బోర్డు తొలగింపు

Satyam NEWS

సుశాంత్ ఆత్మహత్యతో హీరోయిన్ రియాపై కేసు

Satyam NEWS

ఎటాకింగ్ పాలిటిక్స్ కాదు… ప్లానింగ్ పాలిటిక్స్ కావాలి

Satyam NEWS

Leave a Comment