31.7 C
Hyderabad
April 19, 2024 01: 51 AM
Slider వరంగల్

ములుగు బస్టాండ్ లో ఆగని చోరీలు: పనిచేయని సీసీ కెమెరాలు

#mulugubusstand

ములుగు జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ లో చోరీలు ఆగడం లేదు. స్థానిక బస్టాండ్ లో ప్రయాణం కోసం చాలా మంది వేచి ఉంటారు. ప్రజలు గంటలకొద్ది వేచి ఉండడాన్ని గమనించిన కొంతమంది దుండగులు వారిని నమ్మించి, వారి వద్ద ఉన్న వస్తువులు, నగదును ఎత్తు కెళ్తున్నారు.

బస్టాండ్ లో నిఘా లేకుండా పోయిందని గమనించిన వారే, ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని పలువురు అంటున్నారు. వివరాల్లోకి వెళితే ములుగు మండలంలోని జంగాలపల్లి రామ్ నగర్ గ్రామానికి చెందిన బట్టు గౌరమ్మ అనే మహిళ సోమవారం వైద్యం కోసం హనుమకొండ  ఆస్పత్రికి బయలుదేరింది.

ములుగు బస్టాండ్ లో హనుమకొండ బస్సుల కోసం వేచి చూస్తుండగా, బస్టాండ్ లోపల బెంచిల పై కూర్చుంది. కూర్చున్న క్రమంలోనే పర్సు పక్కన పెట్టింది. పక్కనే ఇంకొక వ్యక్తి వచ్చి, గుట్టుచప్పుడు కాకుండా ఆ పర్సును అపహరించుకొని వెళ్ళిపోయాడు.

వెంటనే పర్సు కోసం ఎతకగా ఎక్కడ చూసిన కనబడలేదు. ఆ పర్స్ లో వైద్య కోసం తెచ్చుకున్న నగదు 5000 రూపాయలు ఉన్నాయని బాధితురాలు లబోదిబోమంటూ తెలిపింది. వెంటనే పోలీస్ స్టేషన్కు ఆ బాధితురాలు వెళ్లి సమస్య చెప్పుకుంది.

పోలీసులు వచ్చి అంతట వెతికినా పర్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి దొరకలేదు. ప్రస్తుతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. కాబట్టి పోలీసులకు దొంగలు దొరకడం లేదు..

Related posts

పేదింటి బిడ్డ ఎంబిబిఎస్ కు సాయం అందించిన ఎమ్మెల్యే కోనప్ప

Satyam NEWS

హౌ టు విన్:రేవంత్ దెబ్బకు మల్లారెడ్డి మంత్రి పదవి మటాష్

Satyam NEWS

బాధితులకు అన్ని వేళల అండగా ఉంటాం

Bhavani

Leave a Comment