32.2 C
Hyderabad
March 29, 2024 00: 08 AM
Slider ప్రపంచం

కరోనా వైరస్ మ్యుటేషన్ కు సంబంధించి ఇది శుభవార్త

CoronaVirusMutations

కరోనా వైరస్ కు సంబంధించి ఒక శుభవార్తను హైదరాబాద్ లోని సీసీఎంబి వెల్లడించింది. మన దేశంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ మ్యుటేషన్ జరిగిందని ఆ మధ్య పలు రకాల వార్తలు వెల్లువెత్తాయి.

విదేశాలలో మరీ ముఖ్యంగా యూరప్ లో వచ్చిన కరోనాకు మన దేశంలోని కరోనాకు చాలా తేడా ఉందని కూడా వార్తలు వెలువడ్డాయి.

ఈ కారణంగా ఇతర దేశాలలో తయారైన కరోనా వ్యాక్సిన్ మన దేశంలో పని చేస్తుందా? అనే ప్రశ్న తలెత్తింది. ఈ అంశంపై హైదరాబాద్ లోని సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబి) పరిశోధన చేసింది.

దేశంలో సోకుతున్న కరోనా వైరస్ ను తీసుకుని సీసీఎంబి పలు పరిశోధనలు చేసింది. దాదాపు రెండు వేల SARS-CoV-2 జీనోమ్ అను సీసీఎంబి విశ్లేషించింది.

మన దేశంలో విస్త్రతంగా ఉన్న వైరస్ ను I/A3i గా కొద్ది కాలం కిందట సీసీఎంబి నామకరణం చేసింది. దీనితో పోలిస్తే కరోనా వైరస్ లో మనదేశంలో నాలుగు రకాల మ్యుటేషన్లు జరిగినట్లు గా కూడా గుర్తించారు.

అన్ని ఎన్ని మ్యుటేషన్లు జరిగినా వైరస్ తన స్వభావాన్ని మార్చుకున్నా కూడా  ప్రపంచంలో వ్యాప్తిలో ఉన్న వైరస్ తో పోలిస్తే 70 శాతం భారతీయులలో ఉన్న వైరస్ కు పోలికలు కనిపించాయి.

కరోనా వైరస్ ఆర్ఎస్ఏ లో మార్పులు లేకపోవడం వల్ల మ్యుటేషన్ ఎన్ని సార్లు జరిగినా కరోనా వైరస్ మౌలిక స్వభావంలో మార్పు లేదని సీసీఎంబి పరిశోధనల్లో తేలింది.

అందువల్ల ప్రపంచంలో ఏ దేశంలో సమర్ధమైన వ్యాక్సిన్ తయారు అయినా దాన్ని మనం కూడా వినియోగించవచ్చునని సీసీఎంబి శాస్త్రవేత్త డాక్టర్ దివ్వ తేజ్ సోపతి వెల్లడించారు.

వ్యాక్సిన్ కానీ కరోనాకు మందు కానీ ఏ దేశంలో కనిపెట్టినా కూడా మనం దాన్ని వాడేందుకు ఏ మాత్రం అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.

Related posts

ఖాకీ రంగు యూనిఫామ్ కాసేపు పక్కన పెట్టిన పోలీసులు…

Satyam NEWS

అధికారులూ నా చావు మీకే అంకితం

Satyam NEWS

మనీ మేడ్:కోట్లు గుమ్మరించి జిమ్మిక్కులు చేసి గెలిచారు

Satyam NEWS

Leave a Comment