28.7 C
Hyderabad
April 25, 2024 05: 22 AM
Slider విజయనగరం

పాత నేరస్థుడిని పట్టుకున్న సీసీఎస్ బృందం…! ఎంత రాబట్టారంటే…?

#vijayanagaram police

కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు పోలీసులను వారి కుటుంబాలకు దూరం చేసిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ పాపారావు అనూహ్యంగా కరోనా కబళించింది.

తెలిసిన సమాచారమే మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అదే డీఎస్పీ పని చేసే సీసీఎస్ ఆఫీసులో సీఐలు కాంతారావు, శ్రీనివాసరావు,సంజీవరావులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి…దృష్టి మరల్చి ఏటీఎం లో నగదు అపహరించే నేరస్థుడిని చూపించారు.

జిల్లాలోని తెర్లాంకు చెందిన పాత నేరస్థుడు అక్కిరెడ్డి శ్యామ్ సుందర్ ను చీపురు పల్లి పోలీసుల సహాయం తో సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని లక్షా 90వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగరంలో ని గంటస్థంభం వద్ద సీసీఎస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ కాంతారావు మాట్లాడారు.

జిల్లాలో బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి ,సాలూరు లలో గత కొద్ది నెలల నుంచీ ఏటీఎం ల వద్ద దొంగతనాలకు పాల్పడే వాడని చెప్పారు. ఏటీఎం ను ఆపరేట్ తెలియని వారికి మాయమాటలు చెప్పి తన వద్ద ఉన్న డూప్లికేట్ కార్డ్ ను ఇచ్చి అంతకు ముందు వాళ్ళ ఒరిజినల్ కార్డు తో నగదు డ్రా చేసి వాళ్ళ కు ఆ తర్వాత కార్డు మార్చి ఎటీఎంల నుంచీ నగదును డ్రా చేసే వాడని చెప్పారు.

ఈ క్రమంలో నిందితుడు చీపురు పల్లి వద్ద ఉన్నారని తెలుసుకున్న పోలీసులు పట్టుకున్నామని చెప్పారు.ఈ మీడియా సమావేశంలో సీసీఎస్ ఎస్ఐ లు నరసింగరావు, రమేష్ నాయుడు, సన్యాసి నాయుడులతో పాటు హెచ్ సీలు ప్రసాద్, పాపారావు, వాసులు ఉన్నారు.

Related posts

శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి

Murali Krishna

అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన వారికి ప్రభుత్వ సాయం

Satyam NEWS

మోడల్ విలేజ్: మొక్కలుగా మొలిచిన అభిమానం

Satyam NEWS

Leave a Comment