27.7 C
Hyderabad
April 19, 2024 23: 43 PM
Slider నల్గొండ

వినాయక చవితి పండుగను ఇళ్లలోనే నిర్వహించుకోవాలి

#ArchkaSangham

వినాయక నవరాత్రులు ఎవరికి వారే ఇండ్లలోనే నిర్వహించుకోవాలని మేళ్లచెరువు మండల పౌరోహిత,అర్చక సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈనెల 22వ తేదీన జరుపుకునే వినాయక చవితి పండుగ నవరాత్రి ఉత్సవాలను కరోనా నేపథ్యంలో ప్రతిసారి లాగా వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసుకోవద్దని, ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి, తదితర పండుగలను ఏవిధంగా ఇళ్లలో నిర్వహించుకున్నరో అదే విధంగా ప్రజలు, భక్తులు, అభిమానులు ఎవరికి వారు ఇళ్లలోనే జరుపుకోవాలని తీర్మానించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఈ సమావేశంలో యాతవాకిళ్ళ భాను కిరణ్ శర్మ,  కొంకపాక విష్ణువర్ధన్ శర్మ,  ప్రసాద్ ఆచార్యులు, మహేష్ శర్మ, నరసింహ మూర్తి శర్మ, లక్ష్మీనరసింహ చార్యులు, మరియు స్మార్త ఆగమ పండితులు,అర్చక పౌరోహితులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉద్దానం సేవా సమితి సభ్యుడికి ఆర్ధిక సాయం

Satyam NEWS

కొల్లాపూర్ టిఆర్ఎస్ పార్టీలో మూడవ వర్గం?

Satyam NEWS

విభజన చిచ్చు: ఇక బై..బై…వైసీపీ…

Satyam NEWS

Leave a Comment