27.7 C
Hyderabad
April 26, 2024 04: 12 AM
Slider ఖమ్మం

వెల్లువెత్తిన సంబరాలు

celebrating the outpouring

మెప్మా, ఐకెపి, మున్సిపాలిటీల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, ఇంజినీరింగ్‌, వాటర్‌వర్క్స్‌, ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్లు, బిల్‌ కలెక్టర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి వేతనాలు పెంపు పట్ల కార్మికుల హర్షం వ్యక్తం చేశారు.  ఖమ్మం లోని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో  నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజ్ అధ్వర్యంలో వారంతా సంబరాలు చేసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు  చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి  జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణి అనంతరం బాణసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటారు.

  ఈ సందర్భంగా సుడా ఛైర్మన్ విజయ్ మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికుల కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతూ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఅర్ తో పాటు  వేతనాలు పెంచేందుకు కృషి చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ,  ఉప మేయర్ ఫాతిమా జోహారా, భారతిరాణి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, రాపర్తి శరత్, నాయకులు  కృష్ణ, షకీనా, దేవభక్తుని కిషోర్ బాబు, కంచర్ల, అంజిరెడ్డి, దయాకరఇసాక్, కొల్లు పద్మ, సలీం, వాలబాయిన వేంకటేశ్వర్లు, జహుర్, యేచ్చు ప్రసాద్, ఫ్రాన్సిస్,  సిబ్బంది ఉన్నారు.

Related posts

రిమ్స్‌లో కరోనా రోగులకు మెరుగైన వసతులు కల్పించాలి

Satyam NEWS

డాక్టర్ అనితా రెడ్డి కి స్టేట్ బెస్ట్ లీడర్ అవార్డు

Satyam NEWS

ఏబీఎస్ వృద్ధాశ్రమంలో భూషణ్ రాజు జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment