27.7 C
Hyderabad
April 25, 2024 07: 31 AM
Slider వరంగల్

100 శాతం హాజరు ఉన్న విద్యార్ధులకు బహుమతులు

#mulugu

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ములుగు జిల్లా బరిగలపల్లి ప్రాథమిక పాఠశాల లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్త పల్లి పోషన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గరిగ లత నర్సింగరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చదువుల తల్లి సరస్వతి కి పూల మాల వేసి, చిన్నారి విద్యార్థుల కు మాతృ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా విద్యార్థులకు చిత్ర లేఖనం, కథల పోటీ లు నిర్వహించి సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అదే విధంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పాఠశాల పని దినాల్లో అన్ని రోజులు క్రమం తప్పకుండా హాజరు అయిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు.100 శాతం హాజరు అయిన విద్యార్థులుగా మనోజ్ కుమార్, సృజన, ఆరాధ్య, జయవర్ధన్, సిద్దార్థ ఎంపిక అయ్యారు. మాతృ భాష దినోత్సవ వేడుకల్లో భాగంగా  READ (పుస్తక పఠనోత్సవం) కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి పోటీ ల ద్వారా విద్యార్థుల లో కళా నైపుణ్యాలు పెంపొందుతాయని, అదేవిధంగా 100 శాతం హాజరు ను ప్రోత్సహించడం చాలా బాగుందని సర్పంచ్ అన్నారు. కేవలం ఈ ఐదు, ఆరు మంది విద్యార్థులు మాత్రమే కాకుండా అందరూ 100 శాతం హాజరు కావాలని కోరారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటి పోటీ ల లో అందరూ పాల్గొని తమ తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలన్నారు.

Related posts

నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో పెరుగుతున్న ఆశలు

Satyam NEWS

తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రముఖ కార్మికనాయకుడు శీతల రోషపతి

Satyam NEWS

దైవజ్ఞరత్న అవార్డు అందుకున్న శ్రీ ఘటం రామలింగ శాస్త్రి

Satyam NEWS

Leave a Comment