38.2 C
Hyderabad
April 25, 2024 14: 46 PM
Slider ఖమ్మం

కేరింతలు..ఆట పాటలు

celebrations with games songs

పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హోలీ వేడుకలో పాల్గొన్న ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ గ పోలీస్  సిబ్బందిపై రంగులను చల్లుతూ ఆట, పాటలతో  ఆనందాన్ని పంచుకుంటూ నృత్యాలతో సందడి చేశారు. హోలీ శుభాకాంక్షలతో ప్రారంభమైన సందడి వాతావరణం పోలీస్ బ్యాండ్ చప్పుళ్లతో హోరెత్తింది. ఆప్యాయత, అనురాగాలను పంచే హోలీ వేడుకల్లో కుటుంభీకుల మధ్య అన్యోన్యత, ఆందరూ ఆరోగ్యంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ ని కలసిన పోలీస్ కమిషనర్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ గౌష్ అలమ్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , అడిషనల్ డీసీపీ( AR) కుమారస్వామి, ఏసీపీలు భస్వారెడ్డి, ప్రసన్న కుమార్ , రామానుజం,విజయబాబు, RI లు రవి, శ్రీనివాస్ , సాంబశివరావు , శ్రీశైలం, CI లు చిట్టిబాబు , శ్రీధర్, సర్వయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరోనాతో వారం రోజుల్లో 13 మంది జ‌ర్న‌లిస్టులు మృతి

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికి విజయనగరంలో “టెలి-స్పందన”

Satyam NEWS

50 శాతం సబ్సిడీతో రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment