26.2 C
Hyderabad
November 3, 2024 22: 41 PM
Slider తెలంగాణ ప్రత్యేకం ముఖ్యంశాలు

మంత్రుల సెల్ ఫోన్లు కట్

20190814_173439

తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల ఫోన్ లు కట్ అయ్యాయి. దాదాపుగా అందరు మంత్రులదీ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. కొద్ది మంది మంత్రులకు ఐదు రోజుల కిందటే ఫోన్ లు కట్ కాగా మరి కొందరికి రెండు మూడు రోజుల నుంచి ఫోన్ లు పని చేయడం లేదు. దీంతో మంత్రుల పేషీలకు సంబంధించిన సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ లో మంత్రులకు ఫోన్ సర్వీసులను ఎయిర్ టెల్ అందిస్తున్నది. సత్యం న్యూస్ వాకబు చేయగా తెలిసిన విషయం ఏమిటంటే ప్రభుత్వం నుంచి 2017 నుంచి సెల్ ఫోన్ బిల్లులు పెండింగ్ లో ఉండటంతోనే ఎయిర్ టెల్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఎయిర్ టెల్ కంపెనీకి సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈ బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే గడువు తేదీ ముగియడమే కాకుండా రెండేళ్లకు పైబడి బిల్లు కోసం వేచి చూసిన ఎయిర్ టెల్ కంపెనీ తుదకు ఫోన్ లు కట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సాధారణ పరిపాలన శాఖ (జిఏడీ) నుంచి మంత్రుల సెల్ ఫోన్ బిల్లులు ఎందుకు చెల్లించలేదో స్పష్టత లేదు. కమ్ముకుంటున్న ఆర్ధిక మాంద్యం దృష్ట్యా సెల్ ఫోన్ బిల్లులు చెల్లించడం లేదా లేక మంత్రులు విచ్చలవిడిగా ఫోన్ వాడుతున్నారని బిల్లు చెల్లించలేదా అనేది అర్ధంకావడం లేదు. ఇటీవల కొందరు మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లి సెల్ ఫోన్ ను విరివిగా వాడటం వల్ల ప్రభుత్వంపై ఎంతో భారం పడిందని అంటున్నారు. లేదా సెల్ ఫోన్ సేవలు అందించే కంపెనీ ని ఎయిర్ టెన్ నుంచి మరో సంస్థకు మార్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదా అనే విషయం కూడా తెలియదు. విషయం ఏదైనా మంత్రులకు మాత్రం ప్రస్తుతం అధికారికంగా ఇచ్చిన సెల్ ఫోన్ నెంబర్లు పని చేయడం లేదు

Related posts

మాయ‌మాట‌ల బీజేపీకి బుద్ధి చెప్పాలి

Sub Editor

రణం నా గుణం..

Satyam NEWS

విజయసాయిరెడ్డి కుమార్తెకు తుర్లవాడ కొండ సమర్పయామి?

Satyam NEWS

Leave a Comment