27.7 C
Hyderabad
April 24, 2024 07: 55 AM
Slider నల్గొండ

సిమెంట్ పరిశ్రమ కార్మికులకు 8వ ఒప్పందం ప్రకారం వేతనాలు ఇవ్వాలి

#citu

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలం దొండపాడు సిమెంటు పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు ప్రస్తుతం ఏడవ వేతనం ఒప్పంద కాల పరిమితి మార్చి 31 నాటికే ముగిసిందని,1 ఏప్రిల్ నుండి ఎనిమిదో వేతనం ఒప్పందం అమలు చేయాలని సిఐటి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి డిమాండ్ చేసినారు.

ఈ సందర్భంగా శీతల రోషపతి మాట్లాడుతూ దొండపాడు గ్రామంలో జువారి సిమెంట్,ఇతర సిమెంట్ పరిశ్రమలలో పనిచేసే కార్మికుల సర్వే సందర్భంగా పెరిగిన వేతనాలు గత తొమ్మిది సంవత్సరాల నుండి అమలు చేయడం లేదని,మేజర్ ప్లాంట్ లో ఏజ్ బోర్డు ప్రకారం వేతనాలు ఇవ్వటం లేదని,లంచ్ బ్రేక్ టైం కనీసం గంట ఇవ్వాలని,ఈఎస్ఐ హాస్పిటల్ పరిశ్రమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, కార్మికుల పిల్లలకు స్కూలు సౌకర్యం లేదని అన్నారు.

కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు త్వరలో చలో కలెక్టర్ కార్యాలయం కార్యక్రమానికి పెద్ద ఎత్తున కదలి రావాలని కోరారు.విస్తృతంగా చర్చించి పరస్పర చర్చల ద్వారా సిమెంట్ పరిశ్రమంలో 35 వేల రూపాయల కంటే తక్కువగా వేతనం ఉంటే అందరికీ పర్మనెంట్ కార్మికులు ఇచ్చే వేతనాలు,అలవెన్స్ ఇవ్వాలని కోరారు.పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఇళ్ళు కొనుగోలు చేసే వారికి 100 శాతం వడ్డీ లేని ఋణాలు ఇచ్చి వాయిదాల ప్రకారం కార్మికుల వేతనంలో మినహాయించుకోవాలని,ఎవరైనా సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఉద్యోగి అనుకుంటే ఉచితంగా సిమెంట్ ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఈమెయిల్ అధ్యక్ష్య, కార్యదర్శులు తమ్మిశెట్టి రాజశేఖర్,బండారి శౌరి,శ్రీను,ఎస్.కె కమల్,పిట్ల వెంకయ్య, వీరబాబు,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

Bhavani

చిల్లర ప్రాజెక్టులు కాదు సీమను సమగ్రంగా అభివృద్ధి చేయాలి

Satyam NEWS

లాక్ డౌన్ లో స్ఫూర్తిగా నిలుస్తున్న కానిస్టేబుల్స్ సేవలు

Satyam NEWS

Leave a Comment