34.2 C
Hyderabad
April 23, 2024 11: 33 AM
Slider సినిమా

వెరైటీ కామెడీతో అల్లరి సునామీ సృష్టించే చిత్రం సర్వం సిద్ధం

#AllariNaresh

సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానరుపై శ్రీలత రాబిన్ దర్శకత్వంలో రూపొందించిన సర్వం సిద్ధం చిత్రం వెరైటీ కామెడీతో కూడిన అల్లరి సునామీని సృష్టిస్తుందని ప్రముఖ నటుడు, హీరో అల్లరి నరేష్ పేర్కొన్నారు.

ఆయన సర్వం సిద్ధం (నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత) చిత్ర ప్రొమోషనల్ టీజర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు చిత్రం శ్రీను, సినెటేరియా సీఈవో వెంకట్ బులెమోని, చిత్ర నిర్మాత శ్రీలత, దర్శకుడు రాబిన్ నాయుడు, ప్రధాన పాత్రధారి గోవింద్ రాజ్ నీరుడి, హెయిర్ క్రియేషన్స్ ప్రతినిధులు రజిని, వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ టీజర్ ఆద్యంతం రోమాటిక్ కామెడీతో అలరారుతోందని, ఆద్యంతం కామెడీతో రూపొందించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.

చిత్రం పోస్టర్ ను చూస్తుంటేనే, ఈ చిత్రం లో కామెడీ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమవుతోందని, కామెడీని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆనందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు

Bhavani

నిర్లక్ష్యం వహించే సర్పంచ్ లపై వేటు తప్పదు

Satyam NEWS

విజయ్ దివస్ సందర్భంగా స్వర్ణ విజయ జ్యోతి

Satyam NEWS

Leave a Comment