39.2 C
Hyderabad
March 29, 2024 15: 14 PM
Slider నల్గొండ

ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం

#julakantirangareddy

ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రాష్ట్ర సిపిఎం కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రంగా రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలను,సంస్థలను హోల్ సేల్ గా బడా కార్పొరేటర్లకు అమ్ముతూ140 కోట్ల ప్రజల సంపదను కొంతమంది వ్యక్తులకు దోచి పెడుతుంది అని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కరోనా కట్టడిలో పూర్తిస్థాయిలో విఫలమైన మోడీ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ శాస్త్రీయ బద్ధంగా అందరికీ అందేలా చూడాలని అన్నారు.

రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలైన డబుల్ బెడ్ రూమ్ గృహాలు, దళితులకు 3 ఎకరాల భూమి అమలు చేయకుండానే హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం మరొక ఆచరణ సాధ్యంకాని పథకాన్ని తెచ్చారని విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనం కోసం అమలు కానీ పథకాలను ప్రకటనలకే పరిమితం చేస్తున్నారని అన్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ నెల నుండి కలసివచ్చే రాజకీయ పార్టీలతో పోరు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, మాట్లాడుతూ రెండున్నర సంవత్సరముల నుండి ఋణమాఫీ విషయంలో కెసిఆర్ రైతులను మోసం చేస్తూన్నారని, ఇప్పటికైనా ఋణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి నాగారపు పాండు,పల్లె వెంకటరెడ్డి,సైదులు,దుగ్గి బ్రహ్మ, వీరమల్లు, రేపాకుల మురళి,యోనా,హుస్సేన్,జిల్లా కార్యదర్శి నవీన్, మేళ్లచెరువు మండల కార్యదర్శి వటైపు సైదులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అధైర్యపడొద్దు.. అండగా నేనుంటా.!

Satyam NEWS

బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు స్పర్శ దర్శనం టిక్కెట్లు

Satyam NEWS

దళిత బంధు రాష్ట్రం మొత్తం అమలు చేయాలని సీతక్క డిమాండ్

Satyam NEWS

Leave a Comment