36.2 C
Hyderabad
April 25, 2024 20: 55 PM
Slider నల్గొండ

కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు అక్టోబర్ 4న, హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు సిద్ధం అయినట్లు భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా ప్రధాన  కార్యదర్శి యలక సోమయ్య గౌడ్ విలేకరులకు తెలిపారు.

లింగగిరి గ్రామంలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవటానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని,కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలు అర్హులైన కార్మికులకు పకడ్బందీగా అమలు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 8న,జరిగే సమ్మెలో కార్మికులందరూ విధిగా పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తాఫా,ఉప్పతల గోవిందు,శీలం వేణు,ఉప్పతల వెంకన్న,షేక్ నాగుల్ మీరా, జానీమియా,గౌస్,రహీం,శేషయ్య, వీరబాబు,బడేసాహెబ్,బాబా,నాగుల్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అర్హులకు ఇళ్ల స్థలాల పంపిణీ

Bhavani

ఆదిలాబాద్ పర్యాటక రంగ అభివృద్ధి పై దృష్టిసారించండి…

Satyam NEWS

గుంటూరు విజయవాడ మధ్య రైలు వేళల మార్పు

Satyam NEWS

Leave a Comment