29.2 C
Hyderabad
November 8, 2024 12: 52 PM
Slider ప్రకాశం

రాజధాని విషయంలో కేంద్రం పాత్ర పరిమితం

#DaggubatiPurandeswari

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల విషయంలో కేంద్రం పాత్ర  పరిమితమైనదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

ప్రకాశం జిల్లా కారంచేడులో ఆమె నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు తెలంగాణ కేరళ రాష్ట్రాల్లో లో వాటిని అధిగమించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామని పురంధరేశ్వరి తెలిపారు.

అధిష్ఠానం ఆదేశాల మేరకు రాష్ట్రాల్లో  క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు మధ్య వారధిగా పని చేసి బీజేపీని అధికారం లోకి తీసుకురావడమే తమ ధ్యేయమని ఆమె తెలిపారు.

దక్షిణ భారతదేశంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే తన లక్ష్యమని పురంధరేశ్వరి తెలిపారు. బీజేపీలో తనకన్నా ప్రతిభావంతులు ఉన్న తనను నమ్మి జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎంపిక చేయటం పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచంలోనే 13 కోట్ల మంది సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అని ఆమె అన్నారు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి

Satyam NEWS

అనారోగ్యంతో ఉన్న నిరుపేదల పాలిట వరం ముఖ్యమంత్రి సహాయనిధి

Satyam NEWS

రాజకీయాల గతిని మార్చిన నందమూరి తారక రామారావు

Satyam NEWS

Leave a Comment