27.7 C
Hyderabad
April 25, 2024 07: 51 AM
Slider నల్గొండ

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

#TelanganaRytuSangham

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని  రాష్ర్ట కౌలు రైతు సంఘం కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  హైద్రాబాద్ నగరంలో జరిగే ధర్నాలో పాల్గొనేందుకు CPI నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.

ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపటం దురదృష్టకరమని అన్నారు.

వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని, దీనికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని అన్నారు. ధర్నాకు తరలి వెళ్ళిన వారిలో CPI జిల్లా కార్యవర్గ సభ్యులు యల్లావుల రాములు,పాలకూరి బాబు,

ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు బాదే నర్సయ్య, నాయకులు ఉస్తేల బాబు, అనంతు వీరబాబు ,వీరారెడ్డి మాడపల్లి శ్రీను ,ప్రసాద్ ,మంగయ్య ,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎంపీ మాధవ్‌ను సస్పెండ్‌ చేయాలి

Satyam NEWS

కరోనా పై పోరాటానికి వివిన్ డ్రగ్స్ విరాళం రూ.25 లక్షలు

Satyam NEWS

బీ అలెర్ట్: వైన్స్ లు మూత ముందే కొనుక్కోండి

Satyam NEWS

Leave a Comment