30.7 C
Hyderabad
April 24, 2024 00: 37 AM
Slider వరంగల్

జిఎస్టి పేరుతో రాష్ట్రాన్ని మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

#CPMMulugu

దేశంలో ఒకే పన్ను విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం జిఎస్టి వసూలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి ఇ తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలపై అధిక భారం పడుతుందని కేంద్రప్రభుత్వ నిరంకుశ విధానం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నారు.

రాష్ట్రాలన్నీ ఏకమై కేంద్రం మెడలు వంచి తమకు రావాల్సిన వాటా సాధించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ రాష్ట్ర హక్కులను వస్తుందని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు ప్రభుత్వ వాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణకు రావాల్సిన జిఎస్టి బకాయిలు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో దాతల ద్వారా సేకరించిన విరాళాలు (పీఎం కేర్) కు సంబంధించినపూర్తి వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.

Related posts

ఇళ్ళ మోసాలపై జనసైనికుల ఆరా

Bhavani

స్పందన: వినతుల‌ను గడువు లోగానే పరిష్కరించాలి…

Satyam NEWS

ఆర్ కె బీచ్ లో గల్లంతు: ప్రియుడితో ప్రత్యక్షం

Satyam NEWS

Leave a Comment