28.7 C
Hyderabad
April 25, 2024 06: 31 AM
Slider ప్రత్యేకం

సీఎం కేసీఆర్ డిమాండుకు స్పందించిన కేంద్రం

#kcr

సీఎం కేసీఆర్ చొరవతో కేంద్రం నిర్వహించే పోటీ పరీక్షలు ఇక నుంచి అన్ని భారతీయ భాషల్లో నిర్వహించనుంది. భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్పూర్తి ఫరిడవిల్లాలని సిఎం కేసీఆర్ చేస్తున్న కృషికి, కీలక ఫలితం దక్కింది. సిఎం కేసీఆర్ డిమాండ్ మేరకు ఇక నుంచి అన్ని ప్రాంతీయ భాషల్లో కేంద్రం పోటీ పరీక్షలు నిర్వహించనున్నది. రైల్వేలు, డిఫెన్సు, బ్యాంకులు తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను,  కేవలం హిందీ ఇంగ్లీషు భాషల్లో మాత్రమే నిర్వహించడం సరికాదని, భిన్న భాషలున్న దేశంలో ఆయా రాష్ట్రాల స్థానిక భాషల్లోనే పరీక్షలు నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని  ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చేసిన డిమాండుకు కేంద్రం స్పందించింది. సిఎం కేసీఆర్ డిమాండ్ మేరకు, హిందీ ఇంగ్లీష్ తో పాటు రాజ్యాంగం 8 వ షెడ్యూల్ లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని, కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది.  ఈ నేపథ్యంలో, సిఎం కేసీఆర్ గారి చొరవతో కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు, వారి వారి రాష్ట్రాల్లో జరిగే గ్రూప్ 1,2,3 ఎస్సై కానిస్టేబుల్  తదితర పోటీ పరీక్షల కోసం అయ్యే ప్రిపరేషన్,   ఈ నిర్ణయం ద్వారా,  కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకు కూడా ఎంతగానో ఉపయోగ పడుతుంది.

Related posts

ఎన్నాళ్ళగానో వేచి చూస్తున్న “బ్రేక్” ఎట్టకేలకు ఇన్నాళ్లకు

Satyam NEWS

డౌట్ క్లియర్: పబ్లిక్ లోకి వచ్చేసిన ఉత్తర కొరియా కిమ్

Satyam NEWS

ఆర్యవైశ్యులకి సముచిత స్థానం కల్పించింది ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

Leave a Comment