Slider ప్రత్యేకం

ఫైర్ ఆన్ సెంటర్: కేంద్రం ఇచ్చింది బోగస్ ప్యాకేజీ

#Telangana CM KCR

కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ నియంతృత్వ ధోరణిలో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఆరోపించారు. నగదు రాష్ట్రాలలోకి రావాలని మేం చెబితే రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా చేసిందని ఆయన అన్నారు. ఎఫ్ఆర్ బిఎం పరిమితులు పెంచడంలో కూడా దరిద్రపుగొట్టు ఆంక్షలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ఎఫ్ఆర్ బిఎం పరిమితులు పెంచడం వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు.

విద్యుత్ సంస్కరణ లు తీసుకువస్తే పరిమితి పెంచుతామని చెబుతున్నారు. ఇది దుర్మార్గమని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛను హరించేందుకు కేంద్ర తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని ఆయన అన్నారు. మునిసిపాలిటీ పన్నులు పెంచాలని, ప్రజలపై భారం వేయాలని కేంద్రం వత్తిడి తీసుకువస్తున్నదని కేసీఆర్ అన్నారు. ప్యాకేజీ దారుణంగా ఉందని, ఇది బోగస్ ప్యాకేజీ అని అన్నారు. ఇది తీవ్రంగా నిరాశ తెచ్చిందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Related posts

అమెరికా విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్‌మ‌హ‌న్‌

Satyam NEWS

కొండగట్టులో కేసీఆర్ కుటుంబం భూముల దందా…!

Satyam NEWS

కెలికి కయ్యం పెట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment