31.2 C
Hyderabad
April 19, 2024 04: 11 AM
Slider జాతీయం

అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు

ప్యాకింగ్‌పై విక్రేతల పేరు, చిరునామా, ఫిర్యాదుల పరిష్కార అధికారి నంబర్‌ను స్పష్టంగా, అందుబాటులో ఉండే పద్ధతిలో ఈ–కామర్స్‌ సంస్థలు ప్రదర్శించాల్సిందేనని సెంట్రల్‌ కంజ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు సీసీపీఏ అన్ని రాష్ట్రాలు, పారిశ్రామిక సంఘాలకు సమాచారమిచ్చింది.

వినియోగదార్ల రక్షణ (ఈ–కామర్స్‌) నిబంధనలు–2020 ప్రకారం విక్రేతల వివరాలు పొందుపర్చడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ స్పందించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఈ చట్టం కింద చర్య తీసుకుంటామని సీసీపీఏ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌–జూలైలో దేశవ్యాప్తంగా నేషనల్‌ కంజ్యూమర్‌ హెల్ప్‌లైన్‌కు ఈ–కామర్స్‌ కంపెనీల మీద 69,208 ఫిర్యాదులు అందాయి.

Related posts

అప్పు తీర్చకపోతే న్యూడ్ ఫొటోలు పెడతామని బెదిరింపులు: యువతి ఆత్మహత్య

Satyam NEWS

విషజ్వరాల నుంచి రక్షణ కోసం గిరిజనులకు దోమతెరల పంపిణీ

Satyam NEWS

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై అర్చకులు బ్రాహ్మణుల ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment