29.2 C
Hyderabad
September 10, 2024 16: 28 PM
Slider ముఖ్యంశాలు

ఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు మంజూరు

#Pawan kalyan

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90 కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రూ.2934.80 కోట్లు విడుదల చేసిందనీ, అదనంగా ఇప్పుడు రూ.2812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టి.ఓ.ల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని, మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Related posts

పవన్ పై పరువు నష్టం కేసులు పెట్టాలని జగన్ ఆదేశాలు

Satyam NEWS

బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టకు భూమిపూజ

Satyam NEWS

వైసీపీ నిరంకుశ రాజ్యానికి చరమగీతం పాడాలి

Satyam NEWS

Leave a Comment