37.2 C
Hyderabad
March 29, 2024 18: 22 PM
Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వంపై మోదీ అసాధారణ ప్రేమ

#jagandelhi

జగన్ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వం అసాధారణ ప్రేమ కురిపించింది. 2014-15 రెవెన్యూ లోటు కింద ఒకేసారి రూ.10,461 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కోసం ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ నిధుల ను మంజూరు చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ప్రకటించారు. రెవెన్యూ లోటు భర్తీ చేయాలంటూ 2014 నుంచి ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నది. ఇన్నాళ్లుగా కొర్రీలు వేస్తూ వచ్చిన కేంద్రం అకస్మాత్తుగా నిధుల విడుదల చేసింది.

2018లో ఈ విషయమై కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరిపారు. కాగ్ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూలోటును రూ. 16,078 కోట్లుగా పరిగణించాలన్నారు. 2014-15 నాటికి బిల్లులు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కానీ, అప్పట్లో కేంద్రం ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రం ప్రభుత్వం పలు దఫాలుగా వినతిపత్రాలు సమర్పించినా స్పందన కరువైంది.

అయితే, ఈ ఏడాది మార్చిలో కేంద్రం రెవెన్యూ లోటుకు సంబంధించి రాష్ట్రం నుంచి వివరాలు కోరింది. 2014-15, అంతుకుముందు కాలానికి సంబంధించి ఏయే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి? వాటిల్లో చెల్లించాల్సిన బిల్లులు ఏవి? తదితర వివరాలతో ఆధారాలతో సహా పంపాలని కోరింది. ఆ తరువాత ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద సుమారు రూ.10,461 కోట్లను విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

Related posts

రామజన్మభూమి మధ్యవర్తిత్వం విఫలం

Satyam NEWS

కృష్ణానది నిండుకుండలా మారడంతో సంతోషం వ్యక్తం చేసిన మాజీమంత్రి

Satyam NEWS

20న అయోధ్య మైదానంలో హైందవ శంఖారావం…!

Bhavani

Leave a Comment