27.7 C
Hyderabad
April 26, 2024 05: 07 AM
Slider గుంటూరు

ప్రభుత్వ సంస్థల ప్రేవేటికరణ తక్షణమే నిలిపివేయాలి

#GovtEmployees

కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రేవేటీకరణ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ పోస్ట్ మెన్ & యం.టి. యస్, గ్రామీణ డాక్ సేవక్ ఏ.ఐ.పి.ఇ.యూ. పి.యం &  యం.టి.యస్, జీ.డి.యస్ కేంద్ర,రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు డివిజనల్ ఆఫీస్ ల ముందు ఒక రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

అందులో భాగంగా నరసరావుపేట పోస్టల్ డివిజనల్ కార్యాలయం ముందు బుధవారం ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో అల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ గ్రూప్ సి. నరసరావుపేట డివిజనల్ సెక్రటరీ షేక్ జాన్ సైదా, అసిస్టెంట్ సెక్రటరీ కుందూరు పేరా రెడ్డి, చింతా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డివిజనల్ యూనియన్ నాయకులు జె. వెంకమ్ రాజు, సింహాద్రి వేణు, ధర్మారావు, మురళి, సుభాని, కరిముల్లా, పరిశుద్దరావు, లక్ష్మణబాబు, వీరారెడ్డి, పిచ్చయ్య,

సి. ఐ.టి.యు పశ్చిమ గుంటూరు జిల్లా ట్రెజరర్ డి. శివకుమారి, పశ్చిమ గుంటూరు జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు కామినేని రామారావు, సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జెఏసి రాష్ట్ర కన్వీనర్ యస్ కె. జిలానిమాలిక్, సి.ఐ.టి.యు నరసరావుపేట మండలం కార్యదర్శి షేక్ శిలార్ మసూద్, సి. ఐ.టి.యు ఫిరంగిపురం మండలం కార్యదర్శి షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొని ధర్నా కు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జాతీయ సంస్థలను ప్రేవేటికరణ చేయడం ప్రజాస్వామ్యనికి వ్యతిరేకమని, కరోనా తో మరణించిన పోస్టల్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.

కోవిడ్ సమయంలో క్వారంటైన్ మరియూ ఐసోలేషన్ లో వున్న  ఉద్యోగుల సెలవు కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లివ్ గా పరిగణించాలని,2020 జనవరి నుంచి నిలిపివేసిన డి.ఏ,డి.ఆర్ లను వెంటనే విడుదల చేయాలని, మరో 20 రకాల డిమాండ్లతో ధర్నా నిర్వహించారు.

Related posts

ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

Sub Editor

కొండగట్టు ఆలయ పునర్ నిర్మాణంలో గ్రీన్ ఇండియా భాగస్వామ్యం

Satyam NEWS

29న ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏలు నిరసన

Bhavani

Leave a Comment