28.7 C
Hyderabad
April 24, 2024 03: 27 AM
Slider జాతీయం

1.30 లక్షల ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ !

#Central government

తాజా గా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా లక్ష 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్రం త్వరలోనే విడుదల చేయనుంది.


ఈ నోటిఫికేషన్ ప్రకారం CRPF లో లక్ష 30 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ జనరల్ కేటగిరీలో ఈ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఉన్నాయి. ఇందులో పురుషుల కోటాలో 1.25 లక్షల ఉద్యోగాలు మరియు మహిళల కోటాలో 4667 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ CRPF కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుండి 23 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి.


ఇక రిజర్వేషన్ ల ప్రకారం SC మరియు ST లకు అయిదేళ్ల వరకు సడలింపు ఇవ్వనున్నారు, మరియు OBC లకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నారు. ఇక ప్రత్యేకంగా అగ్నివీర్ లకు 10 శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అయితే ఎప్పటి నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అన్న విషయం అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Related posts

స్కానింగుల పేరుతో ఆస్పత్రుల్లో దోపిడీ

Satyam NEWS

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు

Satyam NEWS

దివ్యంగులకు ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ చేయూత

Satyam NEWS

Leave a Comment