35.2 C
Hyderabad
April 20, 2024 16: 45 PM
Slider ఖమ్మం

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

#citu

కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని సిఐటియు ఖమ్మం జిల్లా కార్యదర్శి కళ్యానం వెంకటేశ్వరరావు,  సిఐటియు రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్ లు అన్నారు .  స్థానిక వర్తవ సంఘ భవనoలో సిఐటియు ఖమ్మం టౌన్  మహా సభ జరిగింది. ఈ మహాసభలో వారు మాట్లాడుతూ కేంద్రం కార్మికుల పని గంటల విధానాన్ని పెంచుతుందని, కార్మిక సంఘాలు పెట్టుకోకుండా చట్టాలు మారుస్తా ఉందని,  ఇలాంటి చట్టాలు తెచ్చే ప్రభుత్వాలను కార్మికులు పడగొట్టాలని,  ఆలాగే కార్మికుల ఐక్యత కోసం కార్మికులందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.  అన్ని రంగాల కార్మికులను కాపాడటం కోసం సిఐటియు పనిచేస్తుందన్నారు. భవిష్యత్తులో కార్మికుల సమస్యలపై విరామం లేని పోరాటం చేస్తామన్నారు . ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఖమ్మం  టౌన్ కన్వీనర్ గా ఎర్ర మల్లికార్జునరావు, కో కన్వీనర్ గా వేల్పుల నాగేశ్వరరావుని 25 మందితో కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నేత ఎర్ర శ్రీనివాసరావు సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ రావు, సిఐటియు జిల్లా నాయకులు భూక్య శ్రీనివాసరావు, సిఐటియు సీనియర్ నాయకులు బండారు యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

50,595 మంది పోడు రైతులకు 1,51,195 ఎకరాలు పంపిణీ

Bhavani

ప్రసవ సమయంలో పొరబాటు: పసికందు తలకు గాయం

Satyam NEWS

ప్రముఖ జర్నలిస్టు మాశర్మను సన్మానించిన గిడుగు

Satyam NEWS

Leave a Comment