పర్యావరణాన్ని కాపాడే మట్టి పైపుల పై జిఎస్టి తగ్గిస్తే కంపెనీలు సక్రమంగా నడుస్తాయని దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని తెలంగాణ SWG పైప్ కంపెనీల అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు పి వరప్రసాద్ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు వినతి పత్రం సమర్పించారు. ఇప్పుడు ఉన్న 18% జిఎస్టి నీ 12% కి తగ్గించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల చుట్టూ పక్కల ఉన్న 26 పైపుల కంపెనీలు ఉన్నాయని అవన్నీ ఇప్పుడు ఉన్న 18% జి.ఎస్.టి వలన నష్టాలు ఎదుర్కుంటున్నాయని తెలిపారు. మట్టి పైపుల కంపనీలు ఎకో ఫ్రెండ్లీ పైపుల కంపెనీలు కావడం వల్ల వాటిని ప్రోతాహించాలని కేంద్ర మంత్రిని కోరామని తెలిపారు.