35.2 C
Hyderabad
April 20, 2024 16: 28 PM
Slider విజయనగరం

Vijayanagaram Police: ఐదు కేసుల్లో చైన్ స్నాచ‌ర్ అరెస్టు

#vijayanagarampolice

ఒకే ఒక్క‌డు…చైన్ స్నేచింగ్ లు  చేయ‌డంలో అత‌గాడికి మ‌రెవ్వ‌రూ సాటిలేరు.ఏపీలోని సిక్కోలు జ‌ల్లాకు చెందిన మ‌ణి  చైన్ స్నేచింగ్ లు చేస్తూ త‌న‌కంటూ ఓ  ఇమేజ్ ఏర్ప‌ర‌చుకున్నారు. గ‌తేడాది చివ‌రి రెండు నెల‌లో పొరుగు జిల్లా అయిన విజ‌య‌న‌గరానికి వ‌చ్చి…జాతీయ‌ర‌హ‌దారి కిఅనుకుని ఉన్న పూస‌పాటిరేగ‌, డెంకాడ‌లతో పాటు జిల్లా కేంద్రంలో కూడా పాల్ప‌డ్డారు.

బాదితురాళ్ల పిర్యాదు మేర‌కు.టెక్నిక‌ల్  అవిడెన్స్  ల‌తో రంగంలోకి  దిగిన పోలీసులు ఎట్ట‌కేల‌కే ఒకే ఒక్క‌డిని ప‌ట్టుకున్నారు.ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం  జిల్లాలోని పూసపాటిరేగ, డెంకాడ పీఎస్ పరిధిల‌లో ఐదు చైన్ స్నాచింగ్ ల‌కు పాల్పడిన ఒకే ఒక్క‌డిని పోలీసులు అరెస్ట్ చేసారు.

అత‌గాని వ‌ద్ద నుంచీ సుమారు 12 తులాల బంగారు ఆభరణాలను  స్వాధీనం చేసుకున్నట్లుజిల్లా ఎస్పీ ఎం.దీపిక  తెలిపారు.ఈమేర‌కు డీపీఓలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల పంచాయతీ పాత సుందరపాలెంకు చెందిన కోరెడ్ల వెంకట మణికంఠ రెడ్డి @ మణి అనే వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటుపడి, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన చేసాడు. నంబరు లేని పల్సర్ వాహనంపై తిరుగుతూ, ఒంటరిగా వెళ్ళే మహిళలను లక్ష్యంగా చేసుకొని, వారి మెడలో ఆభరణాలను దొంగిలించుకొని పరారీ అవుతుండేవాడ‌ని ఎస్పీ తెలిపారు..

కొన్ని చోట్ల లభించిన సీసీ ఫుటేజులతో ఈ తరహా నేరాలకు పాల్పడు తున్న వ్యక్తి 20-25 సం.లు మధ్య ఉన్నట్లుగా గుర్తించి, సదరు వ్యక్తిని పట్టుకొనేందుకు వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టేమన్నారు. విజయనగరం సబ్ డివిజన్ ఇన్ చార్జ్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి ఆధ్వర్యంలో సీసీఎస్ సిఐ సిహెచ్. శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్ఐ జయంతి మరియు ఇతర పోలీసు సిబ్బంది సంయుక్తంగా కందివలన సంత జంక్షన్ వద్ద గ‌త రాత్రి వాహన తనిఖీలు చేపట్ట‌గా  పల్సర్ వాహనంపై వస్తున్న కోరెడ్ల వెంకట మణికంఠ రెడ్డిని అదుపులోకి తీసుకున్నార‌న్నారు.

అదుపులో తీసుకుని విచారణ చేయ‌గా, నిందితుడు నవంబరు, డిసెంబరు మాసాల్లో పూసపాటిరేగ మండలం లో – 4, డెంకాడ మండలంలో – 1, మొత్తం ఐదు గొలుసు నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నార‌న్నారు.

ఒంటరిగా వెళ్ళే మహిళల మెడలో బంగారు ఆభరణాలను దొంగిలించి, బైకుపై పరారీ అయ్యే వాడినని అంగీకరించారు. కాగా దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను  ఖర్చుల కోసం అమ్మేందుకు వెళ్ళుతుండగా పోలీసులకు పట్టుబడగా…, అతని వద్ద నుండి 130 గ్రాములు బరువు కలిగిన రెండు పుస్తుల త్రాడులు – 4 తులాలు, ఒక కాసుల పేరు – 3 తులాలు, ఒక నల్లపూసల దండ – తులమున్నర, పుస్తెలు, శతమానాలు – 3 తులాలు (సుమారు 12 తలాలు) ఆభరణాలు, పల్సర్ మోటారు సైకిలును అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

ఈ కేసులో అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, సీసీఎస్ ఇన్స్ పెక్టరు సిహెచ్. శ్రీనివాసరావు, ఎస్ఐలు ఎస్. రవి, ఆర్. జయంతి, ఎఎస్ ఐ ఎ. గౌరీ శంకర్, హెచ్ సి టివిఆర్ కే ప్రసాద్, కానిస్టేబుళ్ళు టి. శ్రీనవాస్, కె.దామోదరరావులు క్రియాశీలకంగా పని చేసారని, వారిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించారు.

Related posts

అల్లూరి స్ఫూర్తితో యువ‌త‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే దిశ‌గా కృషి

Satyam NEWS

ట్యాక్సీ డ్రైవర్ తో మహిళా ఎంపికి తీవ్ర అసౌకర్యం

Satyam NEWS

కడపలో ఉన్నారా? మీకు కరోనా వస్తే ఇక అంతే…..

Satyam NEWS

Leave a Comment