39.2 C
Hyderabad
April 18, 2024 18: 37 PM
Slider ప్రపంచం

కరోనా ఎఫెక్ట్: నెలలో పెళ్లి చైనాలో కర్నూల్ యువతి

chaina carona effect kurnool lady stoped in uhana

కరోనా వైరస్ కలవర పెడుతున్న చైనాలో కర్నూలుకు చెందిన యువతి ఇబ్బందులు ఎదుర్కొంటుంది.చైనా నుండి ఢిల్లీకి వస్తుండగా చైనా అధికారులు వూహాన్ ప్రాంతంలో ఆమెను అడ్డుకోవడం తో అన్నెం శృతి అనే యువతి అక్కడే ఉండిపోయింది. కర్నూలు జిల్లా కోవెల కుంట్ల మండలం బీజనవేములకు చెందిన అన్నెం శృతి గతేడాది ఆగస్టులో టీసీఎల్ కంపెనీ తరపున ట్రైయినింగ్ కు వెళ్లింది.

శృతికి ఈ నెల 14న మహానంది మండలం తమ్మడపల్లెకు చెందిన యువకునితో పెళ్లి ఉంది. పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో శృతి చైనాలో చిక్కుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వెంటనే స్పందించి తమ కుమార్తెను ఇంటికి చేర్చాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు.60 మంది ఉద్యోగులు తిరుపతి నుంచి చైనాకు వెళ్లారు.ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ తీవ్రత కారణంగా అక్కడి నుంచి 60 మంది తిరుగుపయనం అయ్యారు. అయితే శృతిని అడ్డుకున్నారు.

కాగా తమకు అక్కడ తినడానికి తిండి పెట్టడం లేదని మందులు కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. కర్నూలులో ఉంటున్న తన బంధువులతో శృతి వీడియోలో మాట్లాడింది. తమను భారత్ వచ్చేలా చూడాలని కోరింది.

Related posts

సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

Satyam NEWS

టీఆర్ఎస్ పక్కలో డైనమైట్ వచ్చి చేరింది

Satyam NEWS

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

Satyam NEWS

Leave a Comment