ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ వైస్ చైర్మన్ గా తిరుపతికి చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త చక్రధర్ సిద్ధాంతి నియమితులయ్యారు. అకాడమీ చైర్మన్ టీ. విజయకుమార్ ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు అకాడమీ సలహాదారుడు నూకల మణికుమార్ నేడొక ప్రకటనలో తెలిపారు.
రాయలసీమ జిల్లాల్లో జ్యోతిష్య, వాస్తు విద్వాంసుడుగా పేరున్న చక్రధర్ సిద్ధాంతికి ప్రతిభ సేవలకు గుర్తింపుగా ఇటీవల ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ నంది అవార్డును అందచేసింది. అంతే కాకుండా గతంలో జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయితీ సర్పంచ్ గా కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.