35.2 C
Hyderabad
April 24, 2024 14: 21 PM
Slider ఆధ్యాత్మికం

ఒంటిమిట్ట సీత రామ లక్ష్మణ స్వామి వారికి చక్రస్నానం

vontimitta 101

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం సీత రామ లక్ష్మణ స్వామి వారికి చక్రస్నానం ఆచరించారు.

బ్రహ్మోత్సవ వేడుకల ముగింపు సూచికగా శ్రీచక్రస్వరూపుడైన శ్రీహరి చక్ర స్వరూపమును అర్చించి వైదిక విధులను అనుసరించి శ్రీస్వామివారి స్నాపన బింబములను పుష్కరిణికి తెచ్చి స్నానోత్సవంను నిర్వహిస్తారు. దీనినే అవభృథ స్నానం అని అంటారు.

శ్రీవారి దివ్యమూర్తుల శక్తి, శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీసుదర్శనాయుధ శక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి. అందుకే ఈ చక్రస్నానం సృష్టి చక్రానికంతటికీ అత్యంత పవిత్రమైంది. దీనికే అవభృథస్నానమని కూడా పేరు.

శ్రీమహా విష్ణు దివ్యాయుధాలలో చక్రాయుధ ప్రశస్తి ఎంత మహత్తరమో గుర్తిస్తే చక్రస్నాన మహత్యం భక్తులకు అంతగా స్వానుభవానికి వస్తుంది. ఈ వేడుకలను టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ల్లో భాగంగా పదో రోజు ఈ కార్యక్రమంను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు. వాహన సేవలు ఆలయంలోపలే ఉంచి ఊరేగింపు నిర్వహించ కుండా పూజలు నిర్వహించారు.

Related posts

ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద బారులు తీరిన రైతన్న

Satyam NEWS

రేపు వనపర్తికి జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు రాక

Satyam NEWS

భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆలయం

Satyam NEWS

Leave a Comment