38.2 C
Hyderabad
April 25, 2024 11: 42 AM
Slider ముఖ్యంశాలు

టీఆర్ఎస్ నాయకులను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి

#ChallaVamshichandReddy

ప్రజల అవసరాలు పట్టని టీఆర్ఎస్ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ఊరూరా తిరగడం విడ్డురంగా ఉందని, ప్రజా సమస్యలు గాలికొదిలేసిన టీఆర్ఎస్ నాయకులను తరిమికొట్టాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు.

కరోనా కష్టకాలంలో ఎల్ఆర్ఎస్ రూపంలో పేద మధ్యతరగతి ప్రజల రక్తం పిలుస్తున్న ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ ఓట్లపై ఇంత ప్రేమ ఉన్న టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం ఇవ్వాల్సిన పిఆర్సి, ఐఆర్, డిఏ గురించి ఎందుకు మాట్లాడరు? కరోనా లాక్డౌన్ సమయంలో జీతాలు, పెన్షన్ల కోతలపై ఎందుకు ప్రశ్నించలేదు? ప్రమోషన్లు, బదిలీలపై మౌనమెందుకు అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే 27 వేల మంది స్వీపర్లను, మిషన్ భగీరధలోని ఇంగినీర్లను, జి.హెచ్.ఎం.సి, యూనివర్సిటీలలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను తొలగించినప్పుడు ఎక్కడికి పోయినరని మండిపడ్డారు.

రాష్ట్రం ఏర్పడ్డాక నియమించిన ఉద్యోగాలకన్నా తొలగించిన ఉద్యోగాలే ఎక్కువని, ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు కేవలం ఓట్లకోసమే అని, ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు.

పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో పాటు ఇతర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల శ్రమదోపిడీ చేసే టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు.

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల అడ్రసే లేదని, గ్రూప్ 4 పరీక్షలు రాసినా నియామకాలు జరగలేదని, పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ మెన్ ఫలితాలు వెలువడినా శిక్షణకు నోచుకొని నియామకాలు జరగలేదని, ఉద్యానవన శాఖలో HO, HEO పోస్టుల భర్తీ చేయలేదని, అంతర్రాష్ట్ర బదిలీల ఊసేలేదని మండిపడ్డారు.

30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదని, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఒక్క నియామకం కూడా చేపట్టలేదని, ప్రభుత్వ విద్యాసంస్థలని నాశనంచేసి ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించి విద్యా వ్యాపారానికి పునాదులు వేస్తున్నారని అన్నారు.

జీతాలు అందని ప్రైవేటు టీచర్లను, లెక్చరన్లను, బడ్జెట్ పాఠశాలలను ఆదుకోవాలని, ట్యూషన్ ఫీస్, మెస్స్ చార్జీలు, ఫీస్ రేయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఉన్న లక్షన్నర ప్రభుత్వ కాళీలు, పదవీవిరమణ ద్వారా మరో లక్ష కాళీలు వెంటనే బర్తిచేయాలని. ఉద్యోగ అవకాశాలు రాని నిరుద్యోగులకు 3,016 రూపాయల నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Related posts

నెలాఖరున సమ్మెలోకి బ్యాంకు ఉద్యోగులు

Satyam NEWS

బిజెపి రైతు సదస్సులో పాల్గొన్న విజయశాంతి

Satyam NEWS

కిందపడ్డ కేసీఆర్: తుంటి ఎముకకు గాయం

Satyam NEWS

Leave a Comment