24 C
Hyderabad
June 19, 2021 08: 50 AM
Slider తెలంగాణ

తెఫ్ట్ కంట్రోల్ :హైదరాబాద్‌లో చంబల్‌ గ్యాంగ్‌ అరెస్టు

chambal gang

చంబల్‌గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లోగల ఓ వ్యాపారి ఇంట్లో గతనెల 8వ తేదీన భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్న వారు సుమారు రూ. 3 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ చేసింది బిహార్‌కు చెందిన చంబల్‌ గ్యాంగ్‌ అని నిర్ధారణ అయింది. డీఐ రవికుమార్‌, డీఎ్‌సఐ భరత్‌భూషణ్‌ ప్రత్యేక బృందం బిహార్‌ వెళ్లింది. పదిరోజులపాటు అక్కడే మకాం వేసి నిందితుల కోసం గాలించారు. చోరీతో సంబంధం ఉన్న బోలా, హరిశ్చంద్ర, భగవత్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు రామాశిష్‌ పరారీలో ఉన్నాడు. సూత్రధారుడు రాహుల్‌ కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పట్టుబడితే చోరీ అయిన సొత్తు రికవరీ అవుతుందని అంటున్నారు.

Related posts

ఇల్లీగల్: దుర్గగుడి ఇవో నియామకం రద్దు

Satyam NEWS

తెలుగుదేశం పార్టీని బతికిస్తున్న వైసీపీ మంత్రులు

Satyam NEWS

‘బండి’ భయంతో రెడ్డి ఓట్లకు గండి పెట్టుకున్న కేసీఆర్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!