ప్రముఖ సినీ నటుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి తమ్ముడి కుమారుడు అయిన నారా రోహిత్ నిశ్చితార్థ వేడుక హైటెక్స్ నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. నారా రోహిత్ నిశ్చితార్థం హీరోయిన్ సిరి తో జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో జరిగిన నారా రోహిత్ వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. నేడు నిశ్చితార్థం చేసుకున్న నారా రోహిత్-శిరీషలను చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
రోహిత్ పెద్ద నాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుక పెద్దగా వ్యవహరించారు. నిశ్చితార్థ పనులను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షించారు. నిశ్చితార్థానికి వచ్చిన సోదరుడు, ఏపి మంత్రి నారా లోకేష్‌కు రోహిత్ స్వాగతం పలికారు. నిశ్చితార్థ వేడుకలో నారా, నందమూరి కుటుంబాలు, సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. బాణం మూవీతో నారా రోహిత్ తెలుగు సినిమాల్లో తెరంగ్రేటం చేశారు. కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. మంచి కథను సెలక్ట్ చేసుకొని సక్సెస్ అయ్యారు. రోహిత్ సినిమా అంటే మెసేజ్ ఓరియంటెడ్ అనే ముద్ర పడింది.