35.2 C
Hyderabad
April 20, 2024 17: 51 PM
Slider ప్రత్యేకం

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు

#presidentofindia

ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని కోరుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బృందం నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర, పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ  శ్రీనివాస్ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన వారిలో ఉన్నారు.

టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ గుండాల దాడులు, టీడీపీ నేత‌ల అక్ర‌మ నిర్భంధాల‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్రపతిని కోరారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఇలా ఏ రాష్ట్రంలో గంజాయిని పట్టుకున్నా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఏపీలో 23 వేల ఎకరాల్లో గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతోందని అన్నారు.

గుజారాత్ లోని ముంద్రా ఎయిర్ పోర్టులో 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడిందని… దీనిపై విచారణ జరిపితే చివరకు విజయవాడలోని సత్యనారాయణపురం అడ్రస్ బయటకు వచ్చిందని మండిపడ్డారు. ఏపీ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి అవుతున్నాయనే విషయం బయటపడిందని చెప్పారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు సమావేశమయ్య. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రపతికి అన్ని విషయాలను వివరించామని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా దొరకని మద్యం బ్రాండ్లు ఏపీకి వచ్చాయని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్ నాసిరకం మద్యాన్ని తయారు చేయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని అన్నారు.

ఒకప్పుడు అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉన్న ఏపీ… ఇప్పుడు డ్రగ్స్ లో నెంబర్ వన్ గా ఉందని చెప్పారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలు పార్టీ కార్యాలయాలు, తమ నేత పట్టాభి నివాసంపై దాడులు చేశారని అన్నారు. ఇది సీఎం జగన్, డీజీపీ సవాంగ్ ఆధ్వర్యంలో జరిగిందని దుయ్యబట్టారు. డీజీపీ కార్యాలయం, సీఎం నివాసం సమీపంలో కూడా దాడులు జరిగాయని చెప్పారు. వైసీపీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

Related posts

వైభవంగా పెళ్లి చేసుకుంటే కటకటాలు గ్యారెంటీ

Satyam NEWS

విశ్లేషణ: సౌకర్యాలు కల్పించి లాక్ డౌన్ పొడిగించండి

Satyam NEWS

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వైసిపి భారీ సభ

Satyam NEWS

Leave a Comment