40.2 C
Hyderabad
April 24, 2024 18: 26 PM
Slider ఆంధ్రప్రదేశ్

జస్టిస్ ఫర్ దిశ కేసులో నేరస్తులను కఠినంగా శిక్షించాలి

cbn 02

శంషాబాద్ లో జరిగిన దిశ  వ్యవహారం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని, నేరస్తులను ప్రభుత్వం కఠినంగా శిక్షించే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శంషాబాద్ లో జరిగిన దారుణంతో పాటు  షాద్ నగర్ లో దిశ మృత దేహాన్ని దహనం చేసిన విషయాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని 44వ నెంబర్ జాతీయ బైపాస్ రహదారిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటన కు వెళ్తూ కాసేపు కాన్వాయిని రోడ్డుపై ఆపారు. ఈ సందర్భంగా ఆయనను కార్యకర్తలు కలుసుకున్నారు.

అక్కడ హాజరైన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. శంషాబాద్ ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో జరుగుతున్న లోటుపాట్లను గ్రహించి దోషులను త్వరగా శిక్ష పడే విధంగా చూడాలన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. దోషులను కఠినంగా శిక్షలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అనుమతి లేదని పోలీసులు అరెస్టు చేయడం తగదన్నారు. ఈ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Related posts

కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి

Satyam NEWS

అమరావతిపై జగన్ మొండిపట్టుదల వీడాలి

Satyam NEWS

బాలకృష్ణతో డ్యాన్స్ చేయడం నా అదృష్టం

Bhavani

Leave a Comment