31.2 C
Hyderabad
February 14, 2025 19: 01 PM
Slider ఆంధ్రప్రదేశ్

వికీపీడియాను మార్చేసిన చంద్రబాబునాయుడు

vijayasaireddy

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో చేసిన కుట్ర బయటపడిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు తన ట్విటర్‌ అకౌంట్‌లో ‘బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును అప్రతిష్ఠ చేసే కుట్రకు చంద్రబాబు నాయుడు తెగబడ్డాడు. బీసీజీ వికీపీడియా ప్రొఫైల్‌ను ఎడిట్ చేయించి సీఎం జగన్‌మోహన్ రెడ్డికి 50% వాటాలున్నాయని రాయించాడు.

12 సార్లు ఇలా సమాచారాన్ని మార్చే ప్రయత్నం చేశారని ‘ది హిందూ’ పత్రిక బయట పెట్టింది. పాతాళానికి జారిపోయావు బాబూ!” అంటూ ట్వీట్‌ చేశారు. దళిత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. దళితులన్నా, బలహీన వర్గాలన్నా చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపే. ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శించాడు.

తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను దూషించడం చూస్తే అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి పరివర్తన రాలేదని తెలుస్తోంది అంటూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో ఎండగట్టారు.

Related posts

ఎంఐఎం, టీఆర్ఎస్‌కు ఓటేస్తే రాష్ర్టంలో ఇద్ద‌రు సీఎంలు!

Sub Editor

వరద సాయం కొట్టేస్తున్న అధికార పార్టీ నేతలు

Satyam NEWS

అంగరంగ వైభవంగా  గణనాథుని శోభాయాత్ర

Satyam NEWS

Leave a Comment