31.7 C
Hyderabad
April 19, 2024 00: 38 AM
Slider ముఖ్యంశాలు

ఆడిట్ రిపోర్ట్: చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలు

nara family

కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను నారా లోకేష్‌ నేడు ప్రకటించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో ఆయన ఈ వివరాలు అందచేశారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని లోకేష్ తెలియజేశారు. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు. అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని తెలిపారు. తన తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని చెప్పారు. నారా లోకేష్ ఆస్తి 24 కోట్లు, బ్రాహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షలు, దేవాన్ష్‌ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని వివరించారు. ఇక తన పేరిట ఉన్న షేర్లు బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు.

చంద్రబాబు నాయుడు ఆస్తులు: మొత్తం ఆస్తులు రూ.9కోట్లు. మొత్తం అప్పులు రూ.5.13 కోట్లు. నికర ఆస్తులు రూ.3.87కోట్లు. గత ఏడాదితో పోలిస్తే రూ.87లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో) బ్యాంక్ లోన్ రూ.18లక్షలు తగ్గింది.

నారా భువనేశ్వరి ఆస్తులు: మొత్తం ఆస్తులు రూ.50.62 కోట్లు. మొత్తం అప్పులు రూ.11.04 కోట్లు. నికర ఆస్తులు రూ.39.58 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే రూ.8.50కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)

నారా లోకేష్ ఆస్తులు: మొత్తం ఆస్తులు రూ.24.70 కోట్లు. మొత్తం అప్పులు రూ.5.70 కోట్లు. నికర ఆస్తులు రూ.19 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే రూ.2.40 కోట్లు తగ్గుదల (నికర ఆస్తిలో)

నారా బ్రాహ్మణి ఆస్తులు: మొత్తం ఆస్తులు రూ.15.68 కోట్లు. మొత్తం అప్పులు రూ.4.17 కోట్లు. నికర ఆస్తులు రూ.11.51 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే రూ. 3.80 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)

నారా దేవాన్ష్ ఆస్తులు: మొత్తం ఆస్తులు రూ.19.42 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే రూ.71లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో) నారా దేవాన్ష్‌కు చంద్రబాబు హెరిటేజ్‌‌లో తన వాటాలో ఉన్న 26440 షేర్లను గిఫ్ట్ ఇచ్చారు. నిర్వాణ హోల్డింగ్స్ (చంద్రబాబు కుటుంబ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ) మొత్తం అప్పులు రూ.37.20 కోట్లు అప్పులు ఉండేవి. రూ.34.85 కోట్లకు తగ్గుదల. నికర ఆస్తులు రూ.9.10 కోట్లు. గత ఏడాదిలో రూ.2.27 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)

Related posts

ఇంటిని విరాళంగా ఇచ్చేసిన ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

Satyam NEWS

ఓమిక్రాన్‌ పై కొత్త వ్యాక్సీన్ తయారీలో రష్యా

Sub Editor

Analysis: నితీశ్ సుఖానికి టెండర్ పెడుతున్న చిరాగ్

Satyam NEWS

Leave a Comment